Viral Photo:చదువుకు సృజనాత్మకతకు, ప్రతిభకు ఏ మాత్రం సంబంధం లేదు.. మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి. ప్రస్తుతం రోజుల్లో చాలామంది చదువుకున్నవారు సైతం అవకాశాలు లేవంటూ సాకుతో బద్ధకంగా రోజుని గడిపేస్తుంటే.. మరొకొందరు.. తమకు తెలివి తేటలను ఉపయోగిస్తూ.. సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media)ప్రతి ఒక్కటికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు విశేషాలు జరిగినా వెలుగులోకి వస్తున్నాయి. కొందరి టాలెంట్ నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.. తాజాగా ఓ వ్యక్తి.. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం భిన్నంగా ఆలోచించాడు. తన రిక్షాలో ప్రయాణించే ప్రయాణీకులకు ఎండ వేడి తగలకుండా.. చల్లదనం ఉండేలా సరికొత్తగా ఆలోచించాడు. రిక్షాపై రూప్ గార్డెన్(cool-jugaad) ను ఏర్పాటు అందరినీ ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి దేశ విదేశాల్లో నెట్టింట్లో హాట్ హాట్ టాపిక్ అయ్యాడు. తన రిక్షాను మొబైల్ మినీ గార్డెన్‌ని రీడిజైన్ చేసిన ఫోటో ట్విట్టర్(Twitter)లో వైరల్ అవుతుంది. ఈ రిక్షా పైకప్పు పూర్తిగా గడ్డితో కప్పబడి. వాహనం పూర్తిగా కుండీలతో నిండి ఉంది.
కేరళకు చెందిన ఓ రిక్షావాలా మండుతున్న ఎండల నుంచి తన ప్రయాణికులకు ఉపశమనం కలిగించాలని భావించాడు. వినూత్నంగా అలోచించి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా.. తన రిక్షాపై గార్డెన్‌ను ఏర్పాటు చేశాడు. అలాగే రిక్షాకు రెండు వైపులా మొక్కలతో కూడిన కుండీలను ఏర్పాటు చేశాడు. ఈ రిక్షా ప్రయాణికులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ రిక్షాలో ప్రయాణించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రయాణీకులు క్యూ కడుతున్నారు.
This Indian ?? man grew grass on his rickshaw to stay cool even in the heat. Pretty cool indeed! pic.twitter.com/YnjLdh2rX2
— Erik Solheim (@ErikSolheim) April 4, 2022
ఈ రూఫ్ గార్డెన్ రిక్షాను మొదట మైఖేల్ స్కాట్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అనంతరం ఈ ఫోటో ది ఇన్నోవేటివ్ మేక్ఓవర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్ దృష్టిని ఆకర్షించింది. రిక్షా ఫోటోని ట్విట్టర్‌లో రీ ట్విట్ చేశారు. మనుషుల్లో సామర్ధ్యం వేగంగా క్షీణిస్తున్నప్పటికీ.. ప్రపంచంలో సృజనాత్మక వ్యక్తులకు కొరత లేదు. ముఖ్యంగా భారతీయుల్లో సృజనాత్మకతకు కొదువే లేదని అన్నారు. కేరళలోని కుట్టనాడ్ నుండి కేరళలోని కుట్టనాడ్ నుండి సియాచిన్ హిమానీనదం ఇందిరా కల్ వరకూ ఎందరో తెలివైన వారున్నారని వ్యాఖ్యానించాడు. ’ఎండలో కూడా చల్లగా ఉండేందుకు.. ఈ భారతీయుడు తన రిక్షా మీద గడ్డిని పెంచాడు.. నిజంగా చాలా బాగుంది ని ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు భారతీయుల రక్తంలో సృజనాత్మక ఉంది.. ఈ విషయం మనం ఒప్పుకోకపోతే మనం అబద్ధాల జీవితాన్ని గడుపుతున్నామని ఫొటోతో పాటు కామెంట్ కూడా జతచేశారు.
రిక్షావాలా పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతా ఈ వ్యక్తిలా వినూత్నంగా ఆలోచించాలని సూచిస్తున్నారు.
ఈ పోస్ట్‌కి 20,900 పైగా లైక్‌లు వచ్చాయి.
Aliens Humans: భూమి మీద గ్రహాంతరవాసుల లైంగిక దాడి.. బాధితుల్లో ఒకరు గర్భవతి.. పెంటగాన్ సంచలన నివేదిక