Viral Video: కోడి పిల్లలను వేటాడబోయిన గద్ద.. పట్టపగలే చుక్కలు చూపెట్టిన తల్లి కోడి.. షాకింగ్ వీడియో మీకోసం..!

|

Nov 22, 2021 | 6:38 AM

Viral Video: మనిషి అయినా జంతువు అయినా.. తల్లి ప్రేమను మించింది ఈ లోకంలో లేదు. ఆ తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా.. తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది.

Viral Video: కోడి పిల్లలను వేటాడబోయిన గద్ద.. పట్టపగలే చుక్కలు చూపెట్టిన తల్లి కోడి.. షాకింగ్ వీడియో మీకోసం..!
Eagle
Follow us on

Viral Video: మనిషి అయినా జంతువు అయినా.. తల్లి ప్రేమను మించింది ఈ లోకంలో లేదు. ఆ తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా.. తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది. అవసరమైతే.. తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ పిల్లలను సంరక్షిస్తుంది. పెను ప్రమాదాలు ఎదురైన వేళ.. ధైర్యంగా పోరాతుంది. అందుకే అంటారు.. దేవుడైనా అమ్మ తరువాతే అని. తాజగా ఓ గద్ద.. కోడి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా.. తల్లి కోడి.. తన పిల్ల కోళ్లను రక్షించేందుకు సహసించిన విధానానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. భీకరస్థాయిలో గద్దతో పోరాడి.. దానిని హడలెత్తించింది.

ఈ వీడియోలో ఓ కోడి తన పిల్లలతో కలిసి పొలం గట్ల వెంట ఆహారం కోసం తిరుగాడుతోంది. ఇంతలో ఓ గద్ద కోడి పిల్లలను పసిగట్టింది. వాటిని ఆరగించాలని భావించి.. వాటిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. వెంటనే అలర్ట్ అయిన తల్లి కోడి.. తన పిల్లలను రక్షించుకునేందుకు గద్దతో పోట్లాటకు దిగింది. ఎంతగా.. గద్ద భయపడి పారిపోయే స్థాయిలో ఎదురుతిరిగింది. తీవ్రమైన కోపంతో.. గద్దపై కోడి ఎగిరిపడింది. దాంతో గద్ద బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పారిపోయింది. ఈ షాకింగ్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘తల్లి శక్తికి హద్దులు లేవు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తల్లి ప్రేయను కొనియాడుతూ కొటేషన్ల మీద కొటేషన్లు కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 50 వేలకు పైగా వ్యూస్ రాగా, వేలాది లైక్స్ వచ్చాయి.

Viral Video:

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..