Watch: సీలింగ్ లైట్‌లో కదులుతూ భయపెట్టిన వింత ఆకారం..36గంటల పాటు నరకం చూసిన కుటుంబం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

లైట్ ఫిక్చర్ లోపల నాగుపాము చుట్టుకుని ఉన్నట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు. పట్టణ అపార్ట్‌మెంట్లలో భద్రత గురించి కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత ప్రమాదకరమైన సరీసృపం ఎత్తైన భవనంలోకి ఎలా ప్రవేశించగలిగిందంటూ చాలా మంది ప్రశ్నించారు.

Watch: సీలింగ్ లైట్‌లో కదులుతూ భయపెట్టిన వింత ఆకారం..36గంటల పాటు నరకం చూసిన కుటుంబం.. ఇంతకీ ఏం జరిగిందంటే..
cobra found in ceiling light

Updated on: Sep 15, 2025 | 8:48 AM

ఒకరి ఇంటి వంటగదిలో నాగుపాము కనిపించడంతో భయాందోళనలు చెలరేగాయి. భయపడిపోయిన ఆ కుటుంబం పై అంతస్తులోని గదుల్లోకి వెళ్లి బయటి నుండి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకుంటూనే బతికి బయటపడింది. ఆ పాము పదే పదే పైకి వస్తుండటంతో వారిలో ఎవరూ వంటగదిలోకి అడుగు పెట్టడానికి కూడా సాహసించలేదు. ఈ నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 51లో ఒక కుటుంబం తమ సీలింగ్ లైట్ లోపల దాగి ఉన్న నాగుపామును గుర్తించింది. వారు మొదట్లో అదేదో వదులుగా ఉన్న వైర్ అని తప్పుగా భావించారు. కానీ, ఆ వైర్ కదలడం చూసి కంగారు పడ్డారు. అది అక్కడే 36 గంటల పాటు తిష్టవేసి ఇంటిల్లిపాదిని భయపెట్టింది.

దాంతో వెంటనే వారు అటవీ అధికారులను అప్రమత్తం చేశారు. పాములు పట్టేవారి బృందం, గౌతమ్ బుద్ధ నగర్ అటవీ శాఖ అపార్ట్‌మెంట్‌కు చేరుకుని అవిశ్రాంతంగా శ్రమించారు.. గంటల తరబడి పోరాటం తర్వాత, వారు పైకప్పు లోపల ఒక ప్రత్యేక పౌడర్‌ను ఉపయోగించారు. దీని వల్ల ఆ పాము దాక్కున్న ప్రదేశం నుండి బయటకు వచ్చింది. చివరకు, బుధవారం సాయంత్రం నాగుపాము సురక్షితంగా బయటకు తీశారు. ఆ తర్వాత పామును ఓఖ్లా పక్షుల అభయారణ్యంలోకి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 36 గంటల పాటు ఒత్తిడి, భయంతో గడిపిన ఆ కుటుంబం చివరకు ఊపిరి పీల్చుకుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

లైట్ ఫిక్చర్ లోపల నాగుపాము చుట్టుకుని ఉన్నట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు. పట్టణ అపార్ట్‌మెంట్లలో భద్రత గురించి కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత ప్రమాదకరమైన సరీసృపం ఎత్తైన భవనంలోకి ఎలా ప్రవేశించగలిగిందంటూ చాలా మంది ప్రశ్నించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..