Coastal Wonder: ఆకుపచ్చ ఇసుక ఉన్న సముద్ర తీరం.. ప్రపంచంలో ఏకైక బీచ్.. రీజన్ ఏమిటంటే..

|

Jan 18, 2024 | 8:52 PM

ప్రస్తుతం ఒక మిస్టరీ నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఇది చాలా ప్రత్యేకమైనది. దీని గురించి తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు దీని గురించి ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. అదే  మహానా బీచ్ . ఈ సముద్ర తీరంలో ఇసుక ఒక రహస్యాన్ని దాచుకున్నట్లు అనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Coastal Wonder: ఆకుపచ్చ ఇసుక ఉన్న సముద్ర తీరం.. ప్రపంచంలో ఏకైక బీచ్.. రీజన్ ఏమిటంటే..
Green Sand Beach
Follow us on

ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో అనేక రహస్యాలు దాగున్నాయి. ఒక రహస్యాన్ని ఛేదించి గంతులు వేసే మనిషికి ప్రకృతి మరొక మిస్టరీని ఇస్తూ మానవ మేధస్సుకు సవాల్ విసురుతోంది కూడా.. అలాంటి అనేక వింతలు, విశేషాల గురించి చాలా అరుదుగా చదివి ఉంటారు లేదా విని ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక మిస్టరీ నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఇది చాలా ప్రత్యేకమైనది. దీని గురించి తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు దీని గురించి ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. అదే  మహానా బీచ్ . ఈ సముద్ర తీరంలో ఇసుక ఒక రహస్యాన్ని దాచుకున్నట్లు అనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

హవాయి పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ద్వీపసమూహం. ఇందులో 8 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో హవాయి దీవులు అతిపెద్దవి. ప్రపంచానికి హవాయి ద్వీపం పెద్దదని తెలుసు.. అయితే ఇక్కడ ఉన్న మహానా బీచ్ చాలా ప్రత్యేకమైనది. అందమైనది. ఈ బీచ్ లోని ఇసుకను మొదటిసారి చూసినప్పుడు ఎవరైనా సరే  ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి మదిలో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్నింటి ప్రశ్నలో మొదటిది ఈ బీచ్ లోని ఇసుక ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంది. దీని రహస్యం ఏమిటి?

ఇవి కూడా చదవండి

 ఆకుపచ్చ ఇసుక బీచ్

ఆంగ్ల వెబ్‌సైట్ TOIలో ప్రచురించబడిన నివేదిక ప్రకారం.. ఇక్కడ ఉన్న ఇసుక రంగు ఆకుపచ్చగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆకుపచ్చ రంగు ఆలివిన్ రాయి ఉంటుంది. దీని కారణంగా ఇసుక రంగు ఆకుపచ్చగా మారుతుంది. ఈ రాయి ఈ బీచ్ సొంతం.. అందుకనే ప్రపంచానికి ఆలివిన్ ను (పచ్చ రాయి)  హవాయి డైమండ్‌గా తెలుసు. మహానా లోవా  నైరుతి పగుళ్లలో ఉన్న పాత అగ్నిపర్వతంలోని సిండర్ కోన్ నుండి ఉద్భవించిన విలువైన రాయికి చెందిన కణాల నుండి ఆకుపచ్చ ఆలివిన్ (పచ్చలు) ఏర్పడుతున్నాయని పేర్కొంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని జియాలజీ పేజ్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. దాని క్యాప్షన్‌లో మహానా బీచ్‌ను పాపకోలియా బీచ్ లేదా గ్రీన్ సాండ్ బీచ్ అని కూడా పిలుస్తారని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..