మొసలి నీటిలో నివసించే భయంకరమైన క్రూర జంతువు. ఎవరైనా దాని బారినపడ్డారో..చావు ఖాయం అని చెప్పాలి. అడవికి రాజైన సింహం కూడా మొసలి పట్టునుండి తప్పించుకోలేదు. మొసళ్ళు తెలివితేటల్లో, వేటలో వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో ముందుంటాయి. కానీ ఇప్పుడు ఈ ప్రమాదకరమైన జంతువు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇండోనేషియాకు చెందిన మొసళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.. వీడియోలో మొసలి వేట ఎలా ఉంటుందో చూడొచ్చు..
ఇండోనేషియాలోని ఉప్పునీటి మొసళ్లు మనుషులను నదిలోకి లాగేందుకు మునిగిపోయినట్లు నటించడం నేర్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఎవరో గుర్తు తెలియని మనిషి నీటిలో కొట్టుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ, అది మొసలి.. దాని పంజాలు నీటిలో మునిగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది చూస్తే, ఒక వ్యక్తి మునిగిపోతున్నట్లు, సహాయం కావాలేమో అనిపిస్తుంది. మొసళ్లు ఇప్పుడు ఈ టెక్నిక్‌తో మనుషులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
Crocodiles in Indonesia have learned to “pretend to drown” in order to lure humans in to the water to eat them 🤯🐊 pic.twitter.com/YrMFodvNvC
— Daily Loud (@DailyLoud) January 8, 2025
మొసళ్ల వేట వ్యూహానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ వీడియో చూసి చాలా మంది యూజర్లు షాకింగ్ కామెంట్లు చేశారు.. ఇలా చేయడం వెనుక ఆ మొసలి అసలు ఉద్దేశం ఏమిటో ఎలా అర్థం చేసుకోవాలని మరికొందరు యూజర్లు వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి