
కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయింది..! అంటారు.. సరిగ్గా అలాంటి పనిచేసిన ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. చైనాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వృద్ధ మహిళ చాలా రోజులుగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతోంది. కానీ, డాక్టర్లకు చూపించుకోలేదు. ఎలాంటి చికిత్ తీసుకోలేదు. బదులుగా ఆమె అందరినీ ఆశ్చర్యపరిచే పద్ధతిని ఆశ్రయించింది. ఆ మహిళ తన వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ఎనిమిది బతికి ఉన్న కప్పలను మింగింది. మొదట్లో, ఇది నొప్పిని తగ్గిస్తుందని ఆమె భావించింది. కానీ, కథ అడ్డం తిరిగింది. కొంబదులుగా ఆమె పరిస్థితి మరింత దిగజారింది. కొన్ని రోజుల్లోనే, ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి మరియు వాంతులు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.
ఈ వింత సంఘటన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలో జరిగింది. స్థానిక మీడియా ప్రకారం, ఆ మహిళ పేరు జాంగ్. జాంగ్‌కు వెన్నునొప్పి వచ్చినప్పుడు ఎవరో ఆమెకు బతికి ఉన్న కప్పలను తినడం వల్ల నొప్పి తగ్గుతుందని చెప్పారు. అది నమ్మిన బాధితురాలు.. కొన్ని కప్పలను పట్టుకురావాలని తన బంధువులను కోరింది. వాటిని ఏం చేయాలో తెలియక జాంగ్ ఒక రోజులో ఐదు బతికి ఉన్న కప్పలను, మరుసటి రోజు మరో మూడు కప్పలను మింగేసింది.
మొదట్లో ఆమెకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ, కొన్ని రోజుల తర్వాత ఆమె పరిస్థితి వేగంగా క్షీణించింది. భరించలేని కడుపు నొప్పి, బలహీనత మొదలైంది. నొప్పి భరించలేనంతగా మారడంతో తన కుటుంబసభ్యులకు అసలు నిజం చెప్పింది. తాను ఎనిమిది కప్పలను మింగానని చెప్పింది. అది విన్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. జాంగ్ జీర్ణవ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని వైద్యులు చెబుతున్నారు. కానీ, సకాలంలో చికిత్స అందించటంతో ఆమెను ప్రాణాలతో కాపాడారు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇది చైనా ప్రజలకు కొత్తేమీ కాదని కొందరు అన్నారు. ఒక వినియోగదారు ఇలా రాశారు, ఈ ప్రపంచంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యంగా ఉంది. మరొక వినియోగదారు ఇలా రాశారు.. అలాంటి ప్రజలకు ఏమీ జరగదు. వారు ఏదైనా తింటారు. మరొక వినియోగదారు ఇలా రాశారు.. చైనీయులు ఏదైనా తినవచ్చు, కానీ, ఈ మహిళ చేసిన పని చూసి నాకు తల కొట్టుకోవాలనిపిస్తుంది అంటూ మరొకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…