వామ్మో.. రోజూ రాత్రివేళ హెడ్‌ఫోన్స్‌తో పాటలు విన్న యువతి.. కట్ చేస్తే.. చెవులే పోయాయి..

|

Mar 14, 2024 | 9:30 AM

ఇప్పుడు మనుషుల పనులు ఎక్కువగా కంప్యూటర్లలోనే జరుగుతుంటాయి . కనుక కళ్లపై ప్రభావం చూపుతుందని.. తమ మిగిలిన సమయాన్ని మొబైల్ చూడటంలోనే గడుపుతున్నారని తేలింది. మరి ఇలాంటి అలవాటు కళ్ళకు హాని కలిగించకపోతే, మరి ఏమి చేస్తుంది? అదేవిధంగా చెవిలో ఎక్కువ సేపు హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకోవడం వల్ల వినికిడి సమస్య ఎదురవుతోంది. చైనా మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. రెండేళ్లపాటు ప్రతి రాత్రి తన హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూనే ఉంది.. ఈ అలవాటు కారణంగా ఇప్పుడు ఆమె శాశ్వతంగా చెవిటిదిగా మారింది.

వామ్మో.. రోజూ రాత్రివేళ హెడ్‌ఫోన్స్‌తో పాటలు విన్న యువతి.. కట్ చేస్తే.. చెవులే పోయాయి..
Chinese Woman Suffers Permanent Hearing
Follow us on

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల యుగం నడుస్తోంది.  నేడు చిన్న లేదు పెద్ద లేదు.. కళ్లు తెరచిన వెంటనే కళ్ల ముందుకు కనిపించాల్సింది సెల్ ఫోన్ అని చెప్పవచ్చు. వీటి వినియోగం కళ్లకు, చెవులకు జరిగే నష్టం గతంలో కంటే ఎక్కువైంది. ఇప్పుడు మనుషుల పనులు ఎక్కువగా కంప్యూటర్లలోనే జరుగుతుంటాయి . కనుక కళ్లపై ప్రభావం చూపుతుందని.. తమ మిగిలిన సమయాన్ని మొబైల్ చూడటంలోనే గడుపుతున్నారని తేలింది. మరి ఇలాంటి అలవాటు కళ్ళకు హాని కలిగించకపోతే, మరి ఏమి చేస్తుంది? అదేవిధంగా చెవిలో ఎక్కువ సేపు హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకోవడం వల్ల వినికిడి సమస్య ఎదురవుతోంది. చైనా మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. రెండేళ్లపాటు ప్రతి రాత్రి తన హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూనే ఉంది.. ఈ అలవాటు కారణంగా ఇప్పుడు ఆమె శాశ్వతంగా చెవిటిదిగా మారింది.

ఆ మహిళ పేరు వాంగ్. చైనాలోని షాన్‌డాంగ్ నివాసి. ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఆమె స్థానిక సంస్థలో సెక్రటరీగా పనిచేస్తుంది. ఇటీవల ఆమెకు వినికిడి సమస్య రావడంతో..  చెవులను తనిఖీ చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లింది. మీటింగ్‌లో ఎవరైనా మాట్లాడినప్పుడల్లా వాళ్లు ఏం మాట్లాడారో అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది. దీంతో పనిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని  ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి పరిస్థితిలో ఆమె చెవులను డాక్టర్ పరిశీలించినప్పుడు ఆమె ఎడమ చెవిలో శాశ్వత నరాల వినికిడి దెబ్బతినట్లు తెలిసింది. దీని కారణంగా ఆమె మాటలను వినడానికి ఇబ్బంది పడుతోందని గుర్తించారు.

వైద్యులను అడిగితే నిజం చెప్పిన వాంగ్

దీంతో వాంగ్ ను మీ చెవులకు ఏదైనా గాయం అయ్యిందా లేక చాలా సేపు చెవులు భారీ శబ్ధాన్ని విన్నాయా అని అడిగినప్పుడు.. ఆమెకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అది ఆమె ప్రతి రాత్రి హెడ్‌ఫోన్స్‌తో పాటలు వింటూ  అలా నిద్రపోవడం.

ఇవి కూడా చదవండి

రోజూ రాత్రి నిద్రించే ముందు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉండే అలవాటు

కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి తనకు పాటలు వినడం అంటే చాలా ఇష్టమని, రాత్రిపూట పాటలు వింటూనే నిద్రపోయే దానిని అని వాంగ్ చెప్పింది. ఇది తనకు అలవాటుగా మారింది. రోజూ రాత్రి పడుకునే ముందు చెవుల్లో హెడ్ ఫోన్ పెట్టుకుని పాటలు వినడం దినచర్యగా మారింది. ఫలితంగా ఆమె చెవులు శాశ్వతంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఎవరి మాటలు వినాలన్నా ‘వినికిడి యంత్రాలను ఉపయోగించాల్సి వస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..