Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం.. భూమిపైకి దూసుకొచ్చిన అగ్ని కణికలు.. ఇంతకీ అవేంటో తెలుసా.?

|

Jul 31, 2022 | 3:13 PM

Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. అనంత ఆకాశం నుంచి భగ భగమంటూ నిప్పు కణికలు భూ వాతావరణంలోకి దూసుకొచ్చాయి. మొదట దీనిని చూసిన వారు తోక చుక్కలు అని భావించారు. కానీ.. అవి రాకెట్‌ శిథిలాలు అని తర్వాత తెలిసింది. గతకొద్ది రోజుల క్రితం చైనా...

Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం.. భూమిపైకి దూసుకొచ్చిన అగ్ని కణికలు.. ఇంతకీ అవేంటో తెలుసా.?
Follow us on

Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. అనంత ఆకాశం నుంచి భగ భగమంటూ నిప్పు కణికలు భూ వాతావరణంలోకి దూసుకొచ్చాయి. మొదట దీనిని చూసిన వారు తోక చుక్కలు అని భావించారు. కానీ.. అవి రాకెట్‌ శిథిలాలు అని తర్వాత తెలిసింది. గతకొద్ది రోజుల క్రితం చైనా లాంగ్‌ మార్చ్‌ 5బీ అనే రాకెట్‌ను ప్రయోగించింది. తాజాగా ఆ రాకెట్‌కు సంబంధించిన శిథిలాలు భూమిపైకి దూసుకొచ్చాయి. శనివారం హిందూ మహాసముద్రంపై రాత్రి 10.45 గంటల సమయంలో రాకెట్‌ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించాయి.

ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష కమాండ్ నిర్ధారించింది. ఇదిలా ఉంటే చైనా స్పేస్‌ ఏజెన్సీ పనితీరుపై నాసా ప్రతిధిని బిల్ నిల్సన్‌ తప్పుపట్టారు. తమ రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా చైనా అడ్డుకోలేకపోతోందని ఆరోపించారు. వీటివల్ల ఆస్తి, ప్రాణ నష్టం కలుగజేసే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే సదరు రాకెట్‌ శిధిలాలు భూమిపై ఎక్కడ పడిపోయాయన్న స్పష్టత మాత్రం రాలేదు. ఇక రాకెట్‌ శిధిలాలు భూ వాతావరణంలోకి వస్తున్న సమయంలో కొందరు ఆ వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. కాలం తీరినవి లేదా టెక్నికల్‌ సమస్యల వల్ల రాకెట్లు భూ కక్ష్యలోకి పడిపోతాయనే విషయం తెలిసిందే. అయితే సహజంగా వీటిని భూ కక్ష్యాలోకి ప్రవేశించగానే దారి మళ్లించడం లేదా పేల్చేయడం లాంటివి చేస్తుంటారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..