దిల్ నే దివాలా ఇదో వింత ప్రేమకథ..4 గంటల్లో పెళ్లి…18 రోజుల్లో దివాలా తీసిన ప్రేమికుడు

'దిల్ నే దివాలా' ఇదో వింత ప్రేమకథ..ఈ ప్రేమకథ ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేసింది.పెళ్లి తర్వాత ఒక వ్యక్తి తన జీవితకాల పొదుపు మొత్తాన్నికేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే కోల్పోతాడు. నాలుగు గంటల వివాహం ఆ వ్యక్తి 18 సంవత్సరాల పొదుపును తుడిచిపెట్టేసింది. అది ప్రేమ కాదు, ఇది పక్కా ప్రణాళిక, అది కూడా ఒక ప్రొఫెషనల్ స్కామ్. ఆ పూర్తి డిటెల్స్‌ ఏంటో ఇక్కడ చూద్దాం..

దిల్ నే దివాలా ఇదో వింత ప్రేమకథ..4 గంటల్లో పెళ్లి...18 రోజుల్లో దివాలా తీసిన ప్రేమికుడు
Man Loses Savings Marriage

Updated on: Dec 01, 2025 | 5:45 PM

వివాహం జీవితంలో అతిపెద్ద నిర్ణయం. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి తదుపరి అడుగు వేయడం అవసరం. కానీ, కొంతమంది పోయి మీద ఎసరు పెట్టినట్టుగా పెళ్లి కోసం ఎప్పుడైనా సరే అంటూ సిద్ధంగా ఉంటారు. తరువాత వారు జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఒక 40 ఏళ్ల వ్యక్తి బ్లైండ్ డేట్‌కు వెళ్లి కేవలం నాలుగు గంటల పరిచయంతో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి చెడు కాలం మొదలైంది. అతని భార్య ఒక వారంలోనే అతనికి పైసా లేకుండా చేసింది. అతని పెట్టుబడులు, పొదుపులన్నీ పోయాయి. ఇప్పుడు అతను ప్రతి పైసా కోసం కష్టపడుతున్నాడు. మరోవైపు అతని భార్య అతన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతోంది.

ఈ సంఘటన చైనాలోని హెంగ్యాంగ్ నగరంలో జరిగింది. నివేదిక ప్రకారం 40 ఏళ్ల హువాంగ్ జోంగ్‌చెంగ్ ఒక బ్లైండ్ డేట్‌కు వెళ్లి తొలి చూపులోనే ఆ యువతిని ప్రేమించాడు. ఆశ్చర్యకరంగా అతను కేవలం నాలుగు గంటల పరిచయంతో నమ్మి ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ, అసలైన ఆట పెళ్లి అయిన కొన్ని గంటల్లోనే ప్రారంభమైంది. ఆ మహిళ వివిధ కారణాలు చెబుతూ అతని నుండి డబ్బు వసూలు చేయడం ప్రారంభించింది. కేవలం 18 రోజుల్లోనే అతని భార్య రూ. 30 లక్షలు దోచేసింది. అతని పొదుపులు, పెట్టుబడులన్నీ పోయాయి. వారిద్దరూ మొదటి రాత్రి గడిపిన తర్వాత ఆ మహిళ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోయింది. అక్కడ సాన్నిహిత్యం లేదు, భార్యాభర్తల ప్రేమ లేదు… కేవలం డబ్బులెక్కలు మాత్రమే.

హువాంగ్ ప్రకారం, వారి వివాహం జరిగిన రాత్రి ఇద్దరూ ఒక హోటల్‌లో బస చేశారు. వారు దగ్గరగా ఉన్న ఏకైక సమయం అదే. ఆ తర్వాత, ఆ మహిళ అతని నుండి దూరమైంది. అతను తనతో రెండు రోజులు మాత్రమే ఉన్నానని కూడా బాధితుడు చెప్పాడు. ఆ తర్వాత, డబ్బు సంపాదించడానికి గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు వెళ్లమని చెప్పింది. అనంతరం ఆమె వివిధ సాకులతో డబ్బు అడుగుతూనే ఉంది. ఆశ్చర్యకరంగా, ఆమె తన భర్తతో డబ్బు కోసం మాత్రమే మాట్లాడేది. ఆమె అతనితో అస్సలు కలిసేది, మాట్లాడేది కాదు. చివరికి, ఎనిమిది రోజుల్లో అతని డబ్బు అంతా అయిపోయిన తర్వాత, ఆమె అతన్ని మానసికంగా హింసించడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ యువకుడు పూర్తిగా నిరాశలో మునిగిపోయాడు. అతని ముందు ఉన్న అతి పెద్ద సవాలు ఎలా జీవించాలి అనేది.

ఇవి కూడా చదవండి

ఆ మహిళ కోసం ఎనిమిది మంది వ్యక్తులు పెళ్లి సంబంధాలు కుదిర్చారు. అప్పుడు, హువాంగ్ గ్రామానికి చెందిన ఒకరు కూడా అదే సలహా ఇచ్చారు. కాబట్టి, ఇంకేమీ ఆలోచించకుండా, వారు వివాహాన్ని ఖరారు చేశారు. కానీ, ఆ మహిళ తనకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే, అంటే పండుగకు హాజరు కావడానికి లేదా తన కూతురికి కంప్యూటర్ కొనడానికి మాత్రమే హువాంగ్‌తో మాట్లాడుతుంది. 1,314 యువాన్ల చెల్లింపు చాట్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాంక్ బదిలీకి సంబంధించిన అన్ని రుజువులు కూడా ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..