పురాతన వస్తువులకు వేలంలో భలే డిమాండ్ ఉంటుంది. ఇదేం పనికొస్తుందిలే.. అని అనుకున్న వస్తువులే.. వేలంలో కోట్ల రూపాయలు పెట్టి మరీ కొనేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ విస్కీ బాటిల్ రికార్డు స్థాయిలో అమ్ముడైంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపులో జపాన్‌కి చెందిన లిక్కర్ తయారీ సంస్థ సుంటోరీ తయారు చేసిన ది యమజాకీ 55 ఇయర్స్ ఓల్డ్ విస్కీని వేలం పాటలో పెట్టారు. మొత్తం ఎనిమిది మంది ఈ అరుదైన విస్కీని సొంతం చేసుకునేందుకు పోటీ పడగా చివరకు చైనాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 4.14 కోట్ల రూపాయలు చెల్లించి మరీ ఈ విస్కీని దక్కించుకున్నాడు.
Also Read: Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు జీనియసే..
సుంటోరీ వ్యవస్థాపకుడు షింజిరో టోర్రి ఈ ది యమజాకి విస్కీని ప్రత్యేకంగా రూపొందించాడు. 1960లో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి యమజాకీ స్కాచ్‌ని తయారు చేశారని ఆ కంపెనీ చీఫ్ బ్లెండర్ షింజిరో ఫికియో తెలిపారు. ఇదొక అందమైన గ్రీకు శిల్పం వంటిదన్నారు. సుంటోరీ సంస్థ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి లిమిలెడ్‌గా మార్కెట్‌లోకి తెస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే వాటిని సరఫరా చేస్తూ ఉంటుంది.
Also Read:
Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో
రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!