Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు జీనియసే..
పజిల్స్ అంటే ఎవరికి ఇష్టముండదు. మన మెదడుకు మేత వేస్తూ.. కళ్లకు పదును పెడుతూ.. ప్రతీ పజిల్‌ను తగ్గేదేలే...
పజిల్స్ అంటే ఎవరికి ఇష్టముండదు. మన మెదడుకు మేత వేస్తూ.. కళ్లకు పదును పెడుతూ.. ప్రతీ పజిల్‌ను తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేస్తుంటాం. గతంలో వీకెండ్ బుక్స్, మ్యాగజైన్లలో వచ్చే పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్ నెట్టింట బాగా ప్రాచుర్యం పొందాయి. వీటి పట్ల నెటిజన్లు బాగా ఆకర్షితులయ్యారు. ఫోటో పజిల్స్ కంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పేజీలు ఉన్నాయి. కొన్నిసార్లు పాత ఫోటో పజిల్స్ సైతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే మీ కళ్లకు పదునుండాల్సిందే.. ఉంటే మీరు క్షణాల్లో కనిపెట్టేయగలరు. తాజాగా ఓ ఫోటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఓసారి మీరూ చూసేయండి.
Also Read: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!
పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి చుట్టూ గుబురుగా ఎదిగిన మొక్కలతో నిండిన ఓ గార్డెన్‌లో కనిపిస్తోంది కదూ. అది కూడా దాని ప్రక్కనే ఓ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక అక్కడే ఓ విషపూరితమైన పాము నక్కింది. దాన్ని గుర్తించేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. పజిల్‌ను సాల్వ్ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ నూటికి 95 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.
Also Read: ఖతర్నాక్ దొంగ.. స్కెచ్ మాములుగా లేదుగా.. ఫోన్ ఎలా కొట్టేశాడో చూస్తే ఫ్యూజులు ఔట్!
here is the answer.. pic.twitter.com/4YtnU03LCV
— telugufunworld (@telugufunworld) January 16, 2022