జంతువులను చూడడానికి పిల్లలు ఇష్టపడతారు. అందుకనే సర్కస్, జూ సందర్శించడానికి పిల్లలు అమితాసక్తిని చూపిస్తారు. అయితే ప్రకృతికి దగ్గరగా ఉండే జూని సందర్శించడానికి పిల్లలే కాదు, పెద్దలు , వృద్ధులు కూడా వస్తారు. భారతదేశంలో రకరకాల వన్యప్రానులతో నిండిన జంతుప్రదర్శనశాలలు చాలా ఉన్నాయి. సెలవులు, వారాంతాలు వస్తే చాలు వీటి దగ్గర ప్రజలు గుమిగూడారు. ఈ జంతు ప్రదర్శన శాలలలో ఉండే బెంగాల్ పులులు, సింహాలు, చిరుతపులులతో సహా అన్ని రకాల జంతువులను చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే జూ లో ఉండే ఈ భయంకరమైన జంతువులు కూడా ప్రకృతి మధ్యలో ఉన్నా కొన్ని రకాల బోనులలో బంధించి ఉంచుతారు.
అయితే చైనాలో ఒక జూ అన్ని రకాల జూ లకంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ జంతువులు కాదు, మనుషులు బోనులో ఉంటారు. ఇది మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఇందులో నిజం ఉంది. కాబట్టి జంతువులు స్వేచ్ఛగా సంచరించే ఈ విభిన్నమైన జంతుప్రదర్శనశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలోని ఈ జంతుప్రదర్శనశాల ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు లేహె లేడు వైల్డ్ లైఫ్ జూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జూ కూడా.. పులులు, ఎలుగుబంట్లు వంటి అనేక జంతువులు లేహే లేడు వైల్డ్ లైఫ్ జూలో స్వేచ్ఛగా తిరుగుతాయి. విశేషమేమిటంటే.. ఈ జంతువులను చూసేందుకు వెళ్లే సందర్శకులను బోనుల్లో బంధిస్తారు. దీంతో ఈ జో లో బోనులో ఒక పెద్ద జంతువుగా బంధించబడి తిరగాల్సి ఉంటే… వన్య ప్రాణాలు మాత్రం బహిరంగ ప్రదేశంలో స్వేచ్చగా తిరుగుతూ ఉంటాయి.
ఈ జూలో ఉన్న పెద్ద పెద్ద ప్రమాదకరమైన జంతువులను చూసేందుకు వచ్చే ప్రజలను సురక్షితంగా వాటిని చాలా దగ్గరగా చూసే అవకాశాన్ని తమ జూ ఇస్తుందని.. ఈ జూ అధికారులు చెబుతున్నారు. ఈ జంతుప్రదర్శనశాలలో పంజరంలా కనిపించే ట్రక్కులో కూర్చొని ప్రజలను పర్యటనకు తీసుకువెళతారు.
ఈ పర్యటనను ఎలా ఉత్కంఠభరితంగా మార్చాలనే విషయంతో పాటు సందర్శకుల సేఫ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కనుక సింహాలు, పులులు బోనుకు చాలా దగ్గరగా వచ్చిన వాటిని చూసి సందర్శకులు పంజరం నుండి మాంసం ముక్కలను వాటికి అందిస్తారు. ఈ ప్రయాణం చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉంటుందో అదే సమయంలో దైర్య సాహసాలు కలిగి ఉండాలి అనిపించేలా ఉంటుంది.
కనుక మీరు కూడా ఈ ఉత్తేజకరమైన ప్రదేశాన్ని ఆస్వాదించాలనుకుంటే ఈ చైనా జూని సందర్శించండి. ఈ జూలో అడుగు పెట్టడానికి అడ్వాన్ బుకింగ్ చేసుకోవాలి. ఒక నెల ముందుగానే టికెట్స్ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..