Viral: ఈ యువకుడు అదృష్టం కోసం పిచ్చి పని చేశాడు.. చివరికి జైలు పాలయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే.!

|

Apr 29, 2021 | 1:59 PM

ఆర్ధికంగా ఎదగాలని.. లగ్జరీ లైఫ్ జీవించాలని.. జీవితాంతం హ్యాపీగా ఉండాలని.. ఇలా ఎన్నో రకాల కలలు మనిషి కంటుంటాడు...

Viral: ఈ యువకుడు అదృష్టం కోసం పిచ్చి పని చేశాడు.. చివరికి జైలు పాలయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే.!
Flight
Follow us on

ఆర్ధికంగా ఎదగాలని.. లగ్జరీ లైఫ్ జీవించాలని.. జీవితాంతం హ్యాపీగా ఉండాలని.. ఇలా ఎన్నో రకాల కలలు మనిషి కంటుంటాడు. కొందరు వీటి కోసం కష్టపడితే.. మరికొందరు ఈజీ మార్గంలో డబ్బులు సంపాదించాలని తహతహలాడుతుంటారు. ఆ కోవలోనే లాటరీ టికెట్లను నమ్ముకుంటారు. ఇంకొందరైతే పిచ్చిపిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇలాంటి పిచ్చి పని చేసి పోలీసులను, ఎయిర్ పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా మనం రైలు లేదా బస్సు ప్రయాణం చేసేటప్పుడు.. ఏదైనా నది కనిపిస్తే.. అందులో నాణేలు విసురుతుంటాం. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందని కొంతమంది నమ్మకం. దీనిని కాయిన్ ట్రెడిషన్ అని అంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది దీన్ని పాటిస్తున్నారు. ఇక విమానాల్లో ప్రయాణించేవారు కూడా ఈ నమ్మకాన్ని పాటిస్తుంటారు. వారంతా కూడా తాము ప్రయాణించబోయే విమానం ఇంజిన్ లోకి నాణేలను విసురుతారు. అలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. ఇక ఇదే పని చేసిన ఓ యువకుడు జైలు పాలయ్యాడు.

నేషనల్ మీడియాలో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం.. చైనాలోని వాంగ్ అనే యువకుడు వైఫాంగ్ నుండి హైకూకు వెళ్లాల్సి ఉండగా.. అతడు వైఫాంగ్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కాడు. అనుకున్న ప్రకారం అంతా బాగానే జరిగింది.విమానం బయల్దేరింది. రన్ వే మీద ఉండగా అతడు తన దగ్గర ఉన్న ఆరు నాణేలను ఎర్రటి పేపర్ లో చుట్టి విమానం ఇంజిన్ లోకి విసిరాడు. అవి కాస్త కిందపడిపోవడంతో ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు, పోలీసులు పరుగులు పెట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫ్లైట్ ను క్యాన్సిల్ చేశారు. మొత్తం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!