Neeraj Chopra: మీ పేరు నీరజ్ ? అయితే మీకు బిర్యాని ఫ్రీ.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ‘చిల్లీస్’ రెస్టారెంట్..

|

Aug 10, 2021 | 5:13 PM

ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా పేరు మారుమ్రోగుతుంది. మొన్నటి వరకు నీరజ్ గురించి తెలిసిన వారు చాలా తక్కువ .

Neeraj Chopra: మీ పేరు నీరజ్ ? అయితే మీకు బిర్యాని ఫ్రీ.. బంపర్ ఆఫర్ ప్రకటించిన చిల్లీస్ రెస్టారెంట్..
Neeraj Chopra
Follow us on

ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా పేరు మారుమ్రోగుతుంది. మొన్నటి వరకు నీరజ్ గురించి తెలిసిన వారు చాలా తక్కువ . కానీ ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్‏లో దాదాపు వందేళ్ల క్రీడా చరిత్రలో అథ్లెట్ విభాగంలో భారత్‏కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు నీరజ్.. దీంతో యావత్ భారతం నీరజ్ చోప్రా పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ప్రభుత్వాలతోపాటు.. పలు కంపెనీలు నీరజ్‏కు బహుమతులు అందిస్తున్నాయి. అయితే తాజాగా చిల్లీస్ రెస్టారెంట్ యాజమాని నీరజ్ పై తన అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తపరిచాడు.

Neeraj

ఒలంపిక్స్‏లో అథ్లెట్ విభాగంలో భారత్‏కు తొలి స్వర్ణం అందించి.. మన దేశ కళాకారుల కళను సాకారం చేసిన నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు తెలుపుతూ.. చిల్లీస్ రెస్టారెంట్ యాజమాని నీరజ్ పేరున్న వారికి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. నీరజ్ అనే ధీరుడి పేరున్న వారందరికి 10, 11, 12 తేదీలలో తిరుపతి, కడప నగరాల్లోని చిల్లీస్ రెస్టారెంట్ నందు చికెన్ మిని ప్యాక్‏ను ఉచితంగా అందించున్నట్లుగా ప్రకటించాడు.. అయితే వచ్చే అభ్యర్థులు తప్పకుండా తమ ఆధార్ జీరాక్స్ తీసుకురావాలని సూచించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్‏లో ఉన్న ఓ పెట్రోల్ యాజమాని ఆయూబ్ పఠాన్ .. నీరజ్ పై అభిమానంతో.. అతని పేరున్న వారికి రూ. 501 విలువగల పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నీరజ్ అనే పేరున్న వ్యక్తులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి పెట్రోల్ వేసుకువెళ్ళవచ్చని ప్రకటించాడు. దీంతో ఆ పెట్రోల్ బంక్‏కు జనాలు బారులు తీరారు. సోమవారంతో ఉచిత పెట్రోల్ ఆఫర్ గడువు ముగిసింది.

Also Read: Govinda: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బాలీవుడ్ గోవిందుడు.. సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు..

Saranya Sasi: ఇండస్ట్రీలో మరో విషాదం.. పదేళ్లుగా క్యాన్సర్‏తో పోరాటం.. కరోనా కాటుకు బలి.. నటి శరణ్య కన్నుమూత..

Prakash Raj: ప్రకాష్ రాజ్ కాలికి గాయం.. సర్జిరీ కోసం హైదరాబాద్ రాక.. అసలు ఏమైందంటే..