Viral News: పులివెందులలో వింత.. ఆ కోడిపిల్లలను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. ఎందుకంటే..!

|

Dec 09, 2021 | 9:57 AM

Viral News: సాధారణంగా కోళ్లకు రెండే కాళ్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఓ కోడిపిల్లకు నాలుగు కాళ్లు ఉన్నాయి. అవును.. మీరు విన్నది నిజంగా నిజం. గతంలో ఎన్నడూ లేని విధంగా

Viral News: పులివెందులలో వింత.. ఆ కోడిపిల్లలను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. ఎందుకంటే..!
Chicken
Follow us on

Viral News: సాధారణంగా కోళ్లకు రెండే కాళ్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఓ కోడిపిల్లకు నాలుగు కాళ్లు ఉన్నాయి. అవును.. మీరు విన్నది నిజంగా నిజం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కోడిపిల్ల నాలుగు కాళ్లతో జన్మించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందులలో వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. పులివెందులలో నాలుగు కాళ్లతో కోడిపిల్ల పుట్టింది. అది చూసి కోడిని సాకుతున్న వారు ఆశ్చర్యపోయారు. కాగా, ప్రకృతి విరుద్దంగా, వింతగా నాలుగు కాళ్లతో పుట్టిన ఈ కోడిపిల్లను చూసేందుకు స్థానికులు సైతం ఆసక్తిగా కనబరిచారు. పులివెందులలోని నగరిగుట్టలో రామాలయం సమీపంలో ఈ వింత కోడిపిల్ల జన్మించింది. అయితే, అదనంగా వచ్చిన రెండు కాళ్లు ఎక్కువ పొడవు కలిగి ఉన్నాయి. దాంతో ఆ కోడిపిల్ల బరువు మోయలేక పోతోంది. నడిచేందుకు కూడా అది ఇబ్బంది పడుతోంది. విషయం తెలుసుకున్న పశు సంవర్ధక శాఖ అధికారులు.. జన్యుపరమైన లోపాల కారణంగా ఈ కోడి పిల్లకు నాలుగు కాళ్లు వచ్చాయని చెబుతున్నారు. ఏది ఏమైనా.. వింత కోడి పిల్లను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపుతున్నారు.

Also read:

 Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..

Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..