పెళ్లికి ముందే వధువుకు వింత డిమాండ్.. ఈ గోల్డ్ మెడలిస్ట్ వరుడు ఏం అడిగాడో తెలిస్తే..

|

Aug 24, 2024 | 7:02 PM

ఇందులో పెళ్లికూతురులో ఉండాల్సిన గుణగణాలను వివరించి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వరుడు పిహెచ్‌డిలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఘనుడు. కానీ, అతను పెళ్లి కోసం చేసిన డిమాండ్ నిజంగా చాలా విచిత్రంగా ఉంది. వధువు బరువు నుండి రంగు, రూపం, ఉద్యోగం పిల్లల వరకు ఎలా ఉండాలో ఈ పోస్ట్‌లో వెల్లడించాడు.

పెళ్లికి ముందే వధువుకు వింత డిమాండ్.. ఈ గోల్డ్ మెడలిస్ట్ వరుడు ఏం అడిగాడో తెలిస్తే..
Wedding
Follow us on

పెళ్లి చేసుకోవడం అనేది ప్రతి వ్యక్తీ తన జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయాలలో ఒకటి. అందుకే ప్రజలు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటారు. మీకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలి..? అనే ప్రశ్నకు ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక సమాధానం ఉంటుంది. అయితే, మీ భవిష్యత్ జీవిత భాగస్వామిలో మీరు కోరుకున్న లక్షణాలను ఉండాలనుకోవటం తప్పేమీ కాదు.. అయితే, అలాంటిదే ఒక వరుడు తనకు కావాల్సిన వధువులో ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసి చాలా మంది షాక్‌కు గురవుతున్నారు.

చెన్నైకి చెందిన ఓ వరుడు తన పెళ్లికి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ఇందులో పెళ్లికూతురులో ఉండాల్సిన గుణగణాలను వివరించి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వరుడు పిహెచ్‌డిలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఘనుడు. కానీ, అతను పెళ్లి కోసం చేసిన డిమాండ్ నిజంగా చాలా విచిత్రంగా ఉంది. వధువు బరువు నుండి రంగు, రూపం, ఉద్యోగం పిల్లల వరకు ఎలా ఉండాలో ఈ పోస్ట్‌లో వెల్లడించాడు. తను పెళ్లి చేసుకునే వధువు BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ 24 కంటే తక్కువగా ఉండాలని వరుడు డిమాండ్ చేశాడు. తన వ్యక్తిగత పని కంటే తన ఇంటి పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమె కోరుకుంటే తన అభిరుచి కోసం ఉద్యోగం చేయవచ్చు అంటున్నాడు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు..అమ్మాయి అందంగా, మర్యాదగా ఉండటమే కాకుండా ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వహించగలగాలి అని రాశారు. ఆమె ఎనర్జిటిక్ గా ఉండాలి. ఇది కాకుండా, ఇల్లు, కుటుంబం, ఆహారం నుండి బట్టల వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపడానికి ప్రయత్నించాలి. పనివారి సహాయం లేకుండా ఇంటి పనులన్నీ స్వయంగా తానే చేయగలగాలి. ఆమె కోరుకుంటే ఉద్యోగం చేయవచ్చు. కానీ ఆమె వివాహం అయిన 7 సంవత్సరాలు ఎలాంటి ఉద్యోగం చేయటానికి వీల్లేదు. తమకు పుట్టే పిల్లలు బడికి వెళ్లేంత వరకు ఇంట్లోనే ఉండాలని చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది..

ఈ పోస్ట్ పై ఓ లుక్కేయండి..

ఈ పోస్ట్‌ని లక్షలాది మంది చదివారు. పోస్ట్‌కి ప్రతిస్పందిస్తూ, వరుడు ఈ ప్రమాణాలన్నింటికి అనుగుణంగా ఉంటాడో లేదో చూడటానికి నేను ఖచ్చితంగా ఒకసారి వరుడి ముఖాన్ని చూడాలనుకుంటున్నాను అని ఒక వినియోగదారు రాశారు. ఈ పెళ్లికి ఏ తెలివితక్కువ మహిళ అంగీకరించదని మరో నెటిజన్‌ వ్యాఖ్యానించారు. ఈ పిహెచ్‌డి గోల్డ్‌ మెడల్‌ సాధించిన వరుడు తన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండవలసి ఉంటుందని మరికొందరు వ్యాఖ్యనించారు. ఈ డిమాండ్ ఎప్పటికైనా నెరవేరుతుందని భావిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించండి అని మరోకరు ఫన్నీగా కామెంట్‌ చేశారు. ఇకపోతే, ఈ వ్యక్తి చేసిన పోస్ట్‌పై కొందరు ప్రశంసలు కూడా కురిపించారు. ఒకరు స్పందిస్తూ.. తనకు పని చేసే ప్రొఫెషనల్ కాదు, గృహిణి కావాలి అని రాశారు. చాలా మంది అమ్మాయిలు గృహిణులుగా ఉండటానికే ఇష్టపడతారు. పెళ్లికొడుకు ఎలాంటి మొహమాటం లేకుండా నేరుగా తన అభిప్రాయాలను వెల్లడించినందుకు సంతోషం అంటున్నారు.