Inspiring Senior Citizen: లండన్ లో కూతురు.. రైలులో స్వీట్స్ అమ్ముతున్న 80 ఏళ్ల వృద్ధుడు

నేటి కాలంలో మానవ సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి.. ఈ విషయాన్నీ తల్లిదండ్రులు కూడా గుర్తు పెట్టుకోవాలని.. తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా పిల్లల కోసం తమ సంపాదన అంతా ఖర్చు పెడితే రోడ్డుమీద పడడం ఖాయం అని తెలిపే సంఘటనలకు సంబంధించిన అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక 80 ఏళ్ల వృద్ధుడి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై రైలులో స్వీట్లు అమ్ముతున్న ఈ వృద్ధుడికి సంబంధించిన కథనం ఒక ప్రయాణీకుడు తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు. తన భార్యని పోషించడానికి ఆత్మాభిమానంతో కష్టపడుతున్న ఈ తాతగారికి సహాయం చేయమని విజ్ఞప్తి చేస్తూ వేలాది మంది ఈ కథనాన్ని పంచుకున్నారు.

Inspiring Senior Citizen: లండన్ లో కూతురు.. రైలులో స్వీట్స్ అమ్ముతున్న  80 ఏళ్ల వృద్ధుడు
Inspiring Senior Citizen Chennai

Updated on: Sep 19, 2025 | 4:05 PM

చెన్నై లోకల్ రైలు జనంతో కిక్కిరిసి ఉంది. ప్రయాణీకుల రణగొణధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. అప్పుడు ఒక ప్రయాణీకుడు దాదాపు 80 ఏళ్ల వయసున్న ఒక వృద్ధుడు చేతిలో కొన్ని కాగిత పోట్లాలు ఉన్న స్వీట్లు అమ్ముతుండటం గమనించాడు. దీంతో ఆ ప్రయాణీకుడు ఆ వృద్దుడితో మాట్లాడం మొదలు పెట్టాడు. ఆ మాటల్లో వృద్ధుడి జీవిత పోరాటం వెనుక కథ వెలుగులోకి వచ్చింది. తాతగారి జీవితం గురించి తెలిసిన ప్రతి ఒక్కరి హృదయం కన్నీరు పెడుతుంది.

తాతగారి కథనాన్ని సెప్టెంబర్ 9న @GanKanchi అనే యూజర్ X పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ని 1.3 మిలియన్లకు పైగా చూడగా.. కొన్ని వేల మంది చూశారు. షేర్ చేస్తూ తాతగారికి అండగా నిలబడమని కోరుతున్నారు. ఈ పోస్ట్‌లో వృద్దుడికి సంబంధించిన మొత్తం కథను వివరించారు. వారు ” ప్రతి మనిషి కన్నీరు వెనుక ఒక కథ ఉంటుందనే శీర్షికతో రాశారు.

ఇవి కూడా చదవండి

మొత్తం కథ ఏమిటి?

చెన్నై రైలులో 80 ఏళ్ల వ్యక్తి స్వీట్లు అమ్ముతున్న దృశ్యాన్ని చూసి నా గుండె బద్దలైంది. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న అతని సొంత కుమార్తె అతన్ని వదిలేసింది. ఇప్పుడు అతను , అతని భార్య తమను తాము పోషించుకుంటున్నారు. 70 ఏళ్ల వయసున్న అతని భార్య కూడా ఇంట్లో స్వీట్లు తయారు చేస్తుంది. వాటిని ఈ వృద్ధుడు అమ్మడానికి బయలుదేరతాడు. ఈ వయసులో కూడా ఆత్మ గౌరవంతో బతకడానికి భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతున్నారు.

నేను తాతగారి దగ్గర స్వీట్స్ కొన్నా.. రుచి చూశాను… నన్ను నమ్మండి.. వాటి రుచి కేవలం తీపి కాదు.. స్వచ్ఛమైనది… ప్రేమతో నిండి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అతన్ని కలిస్తే.. స్వీట్లు లేదా పోలీలు మాత్రమే కొనకండి… అతని ధైర్యం, అతని పోరాటం , అతని అచంచలమైన ఆత్మగౌరవాన్ని కొనండి. మీరు సహాయం చేయాలనుకుంటే.. అతని నంబర్‌కు అతన్ని సంప్రదించి ఆర్డర్ ఇవ్వండి (చెన్నైలో లభిస్తుంది). కొన్నిసార్లు, ఆహారం రుచిని మాత్రమే కాదు… అది చెప్పలేని కథల భారాన్ని కూడా మోస్తుంది. మన పెద్దలను చివరి దశలో ఒంటరిగా ఉండనివ్వకండి.. వారికి మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వడం పిల్లల బాధ్యత అని చెప్పాడు ప్రయాణీకుడు.

కూతురిపై కేసు నమోదు చేయమంటున్న నెటిజన్లు

ఈ పోస్ట్ పై ఒకతను స్పందిస్తూ.. అతను తన పనుల పర్యవసానాన్ని అనుభవిస్తున్నాడని ఒకరు.. చెన్నైలోని ఏ ప్రాంతంలో తాతగారు ఉంటారు.. నేను ఆర్డర్ చేయాలనుకుంటున్నాను అని ఒకరు కామెంట్ చేస్తున్నారు. మరొకరు కుమార్తెపై కేసు నమోదు చేయండి అని తన కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యూజర్లు ముంబైకి చెందిన వ్యక్తిలా అనిపిస్తున్నారని చెప్పారు. చాలామంది సహాయ చేస్తామని అంటున్నారు. తమ పిల్లల కోసం తమ డబ్బునంతా ఖర్చు చేసి.. తమ భవిష్యత్ కోసం ఏమీ ఆదా చేసుకోని పెద్దలకు.. ఈ తాతగారి జీవితం ఒక గుణపాఠం అని కొందరు అన్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..