Viral Video: కప్పను వేటాడబోయిన పాము.. కట్ చేస్తే.. విషసర్పాన్ని మడతెట్టేసిన చిరుత పిల్ల.. వైరల్ వీడియో!
జంతు ప్రపంచంలో వింతలూ-విశేషాలు ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ కూడా తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి...
జంతు ప్రపంచంలో వింతలూ-విశేషాలు ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ కూడా తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మనల్ని ఎలప్పుడూ థ్రిల్ చేస్తుంటాయి. క్రూర మృగాల వేట ఎప్పుడూ భయంకరంగా ఉంటుంది. అవి సాధు జంతువులను వేటాడటం కామన్. అయితే మీరెప్పుడైనా క్రూర జంతువు.. ఓ సాధు జంతువుకు సహాయపడటం చూశారా.? ఇలాంటి సీన్‌లు అడవిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.
సాధారణంగా పాములు చిన్న చిన్న కీటకాలను, పురుగులను, కప్పలను వేటాడుతుంటాయి. ఒక్కసారి వాటికి ఈ చిన్న జంతువులు చిక్కితే ప్రాణాలు పోవడం ఖాయం. ఇక్కడ కూడా ఓ పాముకు అనూహ్యంగా కప్ప చిక్కింది. దాన్ని వేటాడబోయిన విషసర్పానికి ఊహించని షాక్ తగిలింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తనకు ఎరగా దొరికిన ఓ కప్పను కాలు పట్టుకుని తన నోటితో పాము లాగుతున్నట్లు మీరు చూడవచ్చు. ఆ కప్ప ఏమో విషసర్పం నుంచి తనను తాను రక్షించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అయితే ఇంతలో అనూహ్యంగా సీన్‌లో చిరుత పిల్ల ఎంటర్ అయింది. పాము తలపై తన పంజా వేసి.. కప్పను రక్షించింది. అంతే క్షణాల్లో ఆ విషసర్పాన్ని మడతెట్టేసి.. తన ఆహారంగా చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
కాగా, ఈ వీడియోను ‘wonderfuldixe’ అనే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటిదాకా ఈ వీడియో 8.45 లక్షల వ్యూస్ రాబట్టింది. అలాగే నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియో చూసేయండి.