Viral Video: వారెవ్వా.. ఏం గుండె రా.. మూడు చిరుతలను ముప్పుతిప్పలు పెట్టిన పంది పిల్ల.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అందులో ముఖ్యంగా జంతువులు వీడియోలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకునే వీడియో. చిన్న పంది పిల్ల మూడు చిరుతలను ముప్పుతిప్పలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: వారెవ్వా.. ఏం గుండె రా.. మూడు చిరుతలను ముప్పుతిప్పలు పెట్టిన పంది పిల్ల.. వీడియో వైరల్..
Warthog Vs Cheetahs

Updated on: Sep 12, 2025 | 5:12 PM

సాధారణంగా అడవి పందులు, ముఖ్యంగా వాటి పిల్లలు అడవిలోని పెద్ద జంతువులకు సులభంగా ఆహారంగా మారుతాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఒక చిన్న పిల్ల పంది మూడు పెద్ద చిరుతలకు గట్టి గుణపాఠం చెప్పింది. అడవిలో సఫారీకి వెళ్ళిన ఓ పర్యాటకుడు ఈ అద్భుతమైన వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అడవిలో ఊహించని మలుపు

ఈ వైరల్ వీడియోలో మూడు చిరుతలు ఒక చిన్న పందిపిల్ల ఒంటరిగా ఉన్నదని చూసి దానిని వేటాడడానికి సిద్ధమవుతాయి. కానీ అప్పుడే ఊహించని ఘటన జరుగుతుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి బదులుగా.. ఆ పందిపిల్ల చిరుతలపై ఎదురు దాడికి దిగింది. ఎంత దూకుడుగా వాటిని తరిమికొట్టిందంటే, చిరుతలు భయంతో పరుగులు తీశాయి. ఆ సమయంలో ఆ చిన్న పంది చూపించిన ధైర్యం.. చిరుతల భయం స్పష్టంగా కనిపించింది. నేను వేటకు చిక్కే వాడిని కాదు.. వేటగాడిని అని చెబుతున్నట్లుగా ఆ చిన్న పంది మూడు చిరుతలను తరిమికొట్టడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. చిరుతల నుంచి పంది తప్పించుకుందా లేదా అనేది వీడియోలో స్పష్టంగా కనిపించకపోయినా, తన ప్రాణాలను రక్షించుకోవడానికి అది చూపించిన తెగువ నిజంగా ప్రశంసనీయం.

నెటిజన్ల ప్రశంసలు

ఈ అద్భుతమైన వీడియోను @latestkruger అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా, కొన్ని గంటల్లోనే మూడు లక్షలకు పైగా వీక్షణలు, 12 వేల లైక్‌లను సంపాదించింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఒక యూజర్ చిరుతలకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? అని వ్యాఖ్యానించగా.. మరొకరు ఈ చిన్న పంది నిజమైన బాస్ అని పొగిడారు. ఈ వీడియో ఆత్మరక్షణకు పోరాడాలనే స్ఫూర్తిని నింపుతోందని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..