Chat GPT: డబ్బులు కావాలని అడిగితే.. నిమిషంలో అందించిన చాట్‌జీపీటీ.. అందరూ షాక్

|

Apr 26, 2023 | 12:32 PM

సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వచ్చాక అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన చాట్ జీపీటీ కొన్ని రోజులన అత్యంత ప్రజాధారణ పొందింది. దాని పనితనంతో ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఓ వ్యక్తి తనకు డబ్బు కావాలని చాట్‌జీపీటీని అడగగా నిమిషంలోనే అతనికి డబ్బు వచ్చేలా చేసింది.

Chat GPT: డబ్బులు కావాలని అడిగితే.. నిమిషంలో అందించిన చాట్‌జీపీటీ.. అందరూ షాక్
Chatgpt Robot
Follow us on

సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వచ్చాక అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన చాట్ జీపీటీ కొన్ని రోజులన అత్యంత ప్రజాధారణ పొందింది. దాని పనితనంతో ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఓ వ్యక్తి తనకు డబ్బు కావాలని చాట్‌జీపీటీని అడగగా నిమిషంలోనే అతనికి డబ్బు వచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన జోషువా బ్రౌడర్ అనే వ్యక్తికి డబ్బులు అవసరమయ్యాయి. దీంతో తన పేరు, పుట్టిన తేది, ఉండేచోటును చెప్పి డబ్బు కావాలని చాట్ జీపీటీని అడిగాడు. వెంటనే రంగంలోకి దిగిన చాట్ జీపీటీ అతను ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోని ఆఫర్‌ను ఆన్‌లైన్ లో వెతికిపెట్టింది.

అలాగే దాన్ని ఏ విధంగా క్లెయిమ్‌ చేసుకోవాలో కూడా చెప్పింది.జోషువా బ్రౌడర్ కుడా చాట్‌జీపీటీ చెప్పినట్లే చేశారు. అనంతరం నిమిషం వ్యవధిలోనే కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి 210 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.17000 తన బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యాయి. ఈ విషయాన్ని అతనే ట్విట్టర్‌లో వెల్లడించాడు. అయితే, చాట్‌బాట్‌కు క్యాప్చా రీడ్‌ చేయడంలో మాత్రమే కాస్త ఇబ్బంది తలెత్తిందని అది మినహాయిస్తే మిగతాదంతా.. అదే చేసిందని తెలిపాడు.  ఇది చూసిన నెటీజన్లు ఆశ్చర్యపోతున్నారు.  దీనిపై స్పందించిన ఓ నేటిజన్ ఈ విషయం  చెప్పినందుకు ధన్యవాదాలని.. చాట్‌జీపీటీని చెక్ చేస్తే. .తన పేరు మీద కూడా ఇప్పటివరకు క్లెయిమ్‌ చేయని 385 డాలర్లు ఉన్నాయని తెలిపాడు. అలాగే చాలా మంది తమ పేర్ల మీద కూడా ఇప్పటివరకు క్లేయిమ్ చేసుకోని వాటి గురించి కామెంట్లు చేస్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..