మహమ్మారి తరువాత, చాలా మంది ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలో, అదృష్టవశాత్తూ ఉపాధి దొరికిన వారు చాలా గంటలు, తగినంత జీతంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఇటీవల ఒక ఉద్యోగ ప్రకటన నెట్టింట్లో వైరల్ అయ్యింది. అందులో పేర్కొన్న కారణం తెలిసి, నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చండీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూసి, జనాలు ఆశ్చర్యపోయారు. కంప్యూటర్ యానిమేషన్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వరకు నైపుణ్యాలు కలిగిన వీడియో ఎడిటర్ కావాలని ప్రకటనలో పేర్కొంది. అలాగే అభ్యర్థికి 2D, 3D, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో మొదలైన వాటిలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలని పేర్కొంది. ఉద్యోగ అవసరాలు సహేతుకంగా కనిపించినప్పటికీ, వాళ్లు ఆఫర్ చేసిన జీతం చూసి జనాలు అవాక్కవుతున్నారు. పూర్తి సమయం ఉద్యోగం కోసం కేవలం రూ.10,468లు ఇవ్వనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
Bhai ??? pic.twitter.com/sCE2nvi6en
— Anurag Maurya (@MauryanPentool) August 29, 2022
ఉద్యోగ ప్రకటన స్క్రీన్‌షాట్‌ను అనురాగ్ మౌర్య అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. జీతం చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. అలాగే ఈ ఉద్యోగానికి కనీసం 4 నుంచి 5 ఏళ్ల వరకు ఎక్స్ పీరియన్స్ కావాలని పేర్కొన్నారు.
దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని ఏళ్ల సినియారిటీ ఉన్నప్పుడు ఆ జీతం ఎలా ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నైపుణ్యాలు లేకుంటే ఆ జీతం ఓకే అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.