దొంగలు లేదా అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా మన ఇళ్లల్లోకి చొరబడకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు అవి కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలను కూడా క్యాప్చర్ చేస్తుంటాయి. ఆ కోవకు చెందిన ఓ సంఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఇది కొంచెం పాతదే.. అయినప్పటికీ మరోసారి వైరల్‌గా వైరల్‌గా మారింది.
2006వ సంవత్సరంలో డేవిడ్ అనే వ్యక్తి ఫ్లోరిడాలోని పెన్సకోలాలో తన ఇంటిలో నిద్రిస్తుండగా.. అతడి బెడ్ రూమ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఓ వింతైన దృశ్యం రికార్డైంది. దాన్ని ‘హిస్టరీ'(History) అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేయగా.. అది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. డేవిడ్ బెడ్‌రూమ్ తలుపు దగ్గర నుంచి ఓ అనుమానస్పద ఎల్లో లైట్ వస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆ తర్వాత కొన్ని సెకన్లకు తలుపు వెనుక నుంచి ఒక చిన్న, సన్నగా ఉన్న హ్యూమనాయిడ్ ఫిగర్ తొంగి చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ తలుపు గుండా వెళ్తుంది.
కాగా, ఈ ఫుటేజీలో కనిపించే ఆ నల్లటి ఆకారాన్ని చూసిన చాలామంది.. అది ఏలియన్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇక జర్నలిస్ట్ ఒకరు దీని గురించి మాట్లాడుతూ.. చరిత్రలో అపహరణ, అతీంద్రియ వీక్షణాలకు సంబంధించిన అనేక సందర్భాల్లో బూడిద రంగు గ్రహాంతర వాసుల గురించి చర్చించుకున్నారని చెప్పారు.
అది 1960వ సంవత్సరం నాటి కేసు.. ఇందులో బెట్టీ, బర్నీ హిల్ అనే ఇద్దరు న్యూ హాంప్‌షైర్‌లోని ఒక కంట్రీ రోడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. వాళ్ల కారును ఓ వింత కాంతి వెంబడించింది. ఆ జంట మొత్తంగా వారి దారిని మర్చిపోయారు. ఇన్‌ఫాక్ట్.. గ్రహాంతరవాసులచే అపహరించబడ్డామని పేర్కొన్న మొదటి అమెరికన్లు వారిద్దరే. అప్పట్లో ఈ సంఘటన తర్వాత గ్రహాంతరవాసులు మనుషులను ఎత్తుకెళ్తారని విస్తృతంగా వార్తలు వినిపించాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..