బ్యాడ్మింటన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఈ ఆటకు కోట్లాది మంది అభిమానులున్నారు. మాములుగా అయితే మీరు కూడా బ్యాడ్మింటన్ ఆడి ఉంటారు. అలాగే ఎన్నో మ్యాచ్‌లు చూసి ఉంటారు. కాని పిల్లులు బ్యాడ్మింటన్ ఆడటం ఎప్పుడైన చూశారా ? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కాని నిజంగానే ఓ వ్యక్తి పిల్లులతో బ్యాడ్మింటన్ ఆడిన వీడియో ప్రస్తుతం వైరవుతోంది. లియన్ షార్ట్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు ఈ వీడియోను షేర్ చేశాడు.
ఆ వీడియోలో ఒక వ్యక్తి తన చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్‌ను పట్టుకుని ఉండగా..అతని పక్కన మూడు పిల్లులు ఉన్నాయి. అందులో ఓ పిల్లి డస్ట్‌బిన్ పై కూర్చోగా మరో రెండు పిల్లులు కింద ఉన్నాయి. ఆ వ్యక్తి బ్యాడ్మింటన్ రాకేట్‌తో కాక్‌ని కొట్టగానే డస్ట్‌బిన్ పై కూర్చున్న పిల్లి..దాని చేతులతో కొడుతుంది. దీంతో కింద ఉన్న పిల్లి చేతికి ఆ కాక్ అందకపోయినప్పటికీ ఎగిరి మరీ కాళ్లతో తన్నుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.
పిల్లులతో బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియో..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..