ప్రతీ రోజూ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎలప్పుడూ నలిగిపోతుంటాం. కొంతమంది ఆఫీసుల్లో, మరికొందరు వర్క్ ఫ్రమ్ హోమ్‌లలో శ్రమకు మించి కష్టపడుతుంటారు. ఇక వీరంతా కూడా ఆదివారం వస్తే చాలు కాస్త రిలాక్స్ అవుతుంటారు. ఆ రిలాక్సేషన్ కూడా సరిగ్గా లేకపోతే ఎలా చెప్పండి.! మూడ్ అంతా కూడా నాశనం అయిపోతుంది. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.! కాసేపు మీరు వెబ్ సిరీస్‌లు, సినిమాలు గురించి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎన్నో రకాల చిత్ర విశేషాలు మిమ్మల్ని అలరించడానికి సిద్దంగా ఉన్నాయి. ఇక అందులో ఒకటి ఫోటో పజిల్స్.
ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్‌కు ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉపయోగిస్తున్న దగ్గర నుంచి ఎన్నో ఫోటో పజిల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. వీటికంటూ ప్రత్యేక పేజీలు కూడా పెట్టేశారు. ఇక ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
Spot the snow leopard that’s perfectly camouflaged#Viral #viralnews @the_viralvideos @itsgoneviraI @telugufunworld pic.twitter.com/5R7rsiPUpT
— telugufunworld (@telugufunworld) October 1, 2021
పైన పేర్కొన్న ఫోటోలో ఓ మంచు చిరుత దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. సాధారణంగా మంచు చిరుతలు ఎక్కువగా కొండలపై ఉంటాయి. అలాగే రాళ్ల రంగుతో చిరుత శరీర రంగు కలిసిపోతుంది కాబట్టి.. అదెక్కడ ఉందో గుర్తించలేం. మీరు కూడా కనిపెట్టడం కష్టమే. కానీ కొంచెం తీక్షణంగా చూస్తే పజిల్‌ను మీరు సాల్వ్ చేయొచ్చు. మీవి డేగ కళ్లయితే మొదటి ట్రయిల్‌లోనే కనిపెట్టేస్తారు. లేట్ ఎందుకు మీరు కూడా ఫోటోపై ఓ లుక్కేయండి.
సాధారణంగా మంచు చిరుతలు కొండలు, పర్వతాలపై ఉంటాయి. అవి అరుదైన జాతికి చెందిన జంతువులు. వాటికీ నీలం రంగు గొర్రెలు అంటే మహా ఇష్టం. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలో చురుగ్గా ఉంటాయి. ఒకవేళ ఫోటోలో మంచు చిరుతను గుర్తించలేకపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.
Here is the answer pic.twitter.com/82gHqbhPAc
— telugufunworld (@telugufunworld) October 1, 2021