ప్రతీ రోజూ ఏదొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అవి నెటిజన్ల బుర్రలను పదును పెడతాయి. అసలు అందులో ఏముంది.? ఉంటే ఎక్కడ దాగి ఉందని.. కనిపెట్టడంలో జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పిక్చర్ పజిల్స్ వారికి ప్రతీసారి థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తాయి. ఇక పైన పేర్కొన్న ఫోటోలో ఓ కుక్కపిల్ల దాగి ఉంది. నెటిజన్లు దానిని కనిపెట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఓసారి మీరు కూడా లుక్కేయండి.!
Can you find the dog? It took me 10 minutes.? pic.twitter.com/I3ejOEThyR
— BigDripOfficial (@itsBigDrip) May 25, 2020
ఈ ఫోటోలో కుక్కపిల్లను కనిపెట్టడం కొంచెం కష్టమే. పార్క్ లాంటి ఈ ప్రదేశం.. దూరంలో ఒక బెంచ్.. దగ్గరలో మరొకటి.. వీటి మధ్యంలో ఓ కుక్కపిల్ల దాగి ఉంది. ఈ ఫోటోను ‘Big Drip Official’ అనే ట్విట్టర్ అకౌంట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ”కుక్కపిల్లను కనిపెట్టండి.. నాకు 10 నిమిషాలు పట్టింది గుర్తించేందుకు” అంటూ పేర్కొన్నారు. ఈ పజిల్‌ను క్రాక్ చేయడానికి నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా అందరూ ఈ పజిల్‌లో సక్సెస్ కూడా అయ్యారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి. కాగా, ఈ పిక్ కాస్త పాతదే అయినా మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read:
సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!
బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!
ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు