
Viral Photo: పజిల్స్ ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. వారు ఎలాంటి టాస్క్ అయినా ఛాలెజింగ్‌గా తీసుకుంటారు. తమకు జీవితంలో ఎదురైయ్యే చిక్కుముళ్లనే కాదు.. కంటికి కనిపించిన ఇలాంటి పజిల్స్‌ను సైతం సాల్వ్ చేసి ముందుకు సాగుతారు. అలాంటి వారి కోసం ఓ కిక్కు ఇచ్చే పజిల్ తీసుకొచ్చాం. ఇది మరీ అంత కఠినమైది అయితే కాదు. కూసింత ఏకాగ్రత పెడితే వెంటనే పట్టేయవచ్చు. ఇక్కడ టాస్క్ ఏంటంటే పైన ఉన్న ఫోటో గుడ్లగూబలతో నిండి ఉంది. అవన్నీ మీ వైపే చూస్తున్నాయి కదూ. కాగా వాటి మధ్య ఓ పిల్లి కూడా సైలెంట్‌గా నక్కి ఉంది. ఈ ఇటీవలి ఆప్టికల్ ఇల్యూజన్ మీ దృష్టిని పరీక్షిస్తుంది. ఇందులో 20 సెకన్లలోపు పిల్లిని కనిపెడితే మీ కంటి దృష్టి అద్భుతంగా ఉందని అర్థం. అంతకంటే ఎక్కువ సమయం ఉన్నా కూడా పర్లేదు. అస్సలు కనిపెట్టడం అసాధ్యం అనిపిస్తే మాత్రం మీ ఐ ఫోకస్ కాస్త తక్కువ ఉన్నట్లే. ఇక మరీ గాబారా పడకండి. ఆన్సర్ ఉన్న ఫోటోను కింద ఇస్తున్నాం.
Cat
చూశారా ఆ పిల్లి అక్కడే ఉండి మీతో భలే గేమ్ ఆడింది కదా..! పజిల్స్ అంటేనే అంతే అండీ.. సాల్వ్ చేసేంతవరకు కష్టంగా.. ఒకవేళ కనిపెట్టలేక సమాధానం చూశాక ‘అరెరె.. దీన్ని ఎలా మిస్ అయ్యాం’ అని మదనపడేలా చేస్తాయ్. మీకు ఇలాంటి పజిల్స్ మరిన్ని అందించే ప్రయత్నం చేస్తాం. ఇక ఉంటాం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి