లైఫ్ సాదాసీదాగా సాగిపోతుంటే కిక్కేముంటుంది.. అలాగే మనం చేసే పనిలో కిక్కు లేకపోతే.. మజా ఎక్కడుంటుంది. ఫన్‌తో పాటు కాస్త మెదడుకు మేత కూడా ఉంటే.. అప్పుడే మనకు కావల్సినంత కిక్కు వస్తది. ఇటీవల సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ఫోటో పజిల్స్ వైరల్ అవుతున్నాయి. పిక్చర్ పజిల్స్, నెంబర్ గేమ్స్, స్పెల్ కరెక్షన్స్.. ఇలా ఒకటేమిటి కావలసినన్ని ఉన్నాయి. ఆ కోవకు చెందినది ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాం.
మన హైదరబాద్ మెట్రో.. హైదరాబాదీలకు ట్విట్టర్ వేదికగా ఓ ఛాలెంజ్ విసిరింది. జంబ్లింగ్ వర్డ్స్‌తో ఓ మెట్రో స్టేషన్ ఫోటోను పోస్ట్ చేసి.. ఆ స్టేషన్ పేరేంటో చెప్పాలని సవాల్ విసిరింది. దీంతో నెటిజన్లు తమ బుర్రకు పదునుపెట్టారు. ఆ స్టేషన్ పేరేంటో కనుక్కునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మీరు మేధావులైతే.. ఈజీగా ఆ పజిల్ సాల్వ్ చేసేస్తారు. నూటికి 99 మంది ఆ మెట్రో స్టేషన్ పేరేంటో కనిపెట్టేసారు. మరి మీ సంగతేంటి.. లేట్ చేయకండి.. ఓసారి మీ బుర్రకు పదునుపెట్టండి.. సమాధానం కోసం ట్రై చేయండి..
Guess this Metro Station!#Unjumble #Transportation #Convenience #Commute #HyderabadMetro #ManaMetro #MyMetroMyPride pic.twitter.com/4tASiTwCqS
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) August 29, 2022
సమాధానం: ప్యారడైస్ మెట్రో స్టేషన్