Viral Video: చనిపోయి కనిపించిన కొండచిలువ.. శవపరీక్షలో పొట్ట కోయగా.. వామ్మో..

|

May 29, 2024 | 4:40 PM

చిన్న వయస్సులో ఉన్నప్పుడు, బర్మీస్ కొండచిలువలు నేలపై, చెట్లపై సమాన సమయాన్ని గడుపుతాయి. కానీ అవి పెద్దవుతున్న కొద్దీ చెట్ల కొమ్మలు వాటి బరువును మోయలేక విరిగిపోతుంటాయి కాబట్టి అవి నేలపైనే ఉంటాయి. ఈ పైథాన్‌లకు స్విమ్మింగ్ కూడా వచ్చు. 30 నిమిషాల వరకు నీటిలో ఈత కొట్టగలవు.

Viral Video: చనిపోయి కనిపించిన కొండచిలువ.. శవపరీక్షలో పొట్ట కోయగా.. వామ్మో..
Python - Crocodile
Follow us on

ప్రతి జీవిని కదిలించే నిజం ఒక్కటే ఆకలి.. ముఖ్యంగా అడవిలో ఒక జీవికి ఆకలి వేసిందంటే.. మరో జీవికి ఆయువు మూడినట్లే. ఏనుగు, జింకలు, దుప్పులు లాంటి జీవులు తప్పితే… మెజార్టీ వన్యప్రాణులు మాంసాహార జీవులే. ముఖ్యంగా పాములు ఆహారం కోసం తీవ్రంగా వెంటాడుతూ ఉంటాయి. చిన్న.. చిన్న పాములు అయితే కప్పలు, ఉడతలు, తొండలు, పక్షి గుడ్ల వంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. మరి కొండ చిలువల పరిస్థితి ఏంటి..? ఒక పెద్ద జీవిని తింటేనే అవి మనగలుగుతాయి. ఈ క్రమంలోనే అవి కొన్ని సార్లు రిస్క్ చేస్తూ ఉంటాయి. అలివికాని జీవులను కూడా అమాంతం మిగేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటాయి. 18 అడుగుల పొడవున్నబర్మీస్ కొండచిలువ కడుపులో 5 అడుగుల పొడవైన మొసలి ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతేడాదికి సంబంధించిన ఆ వీడియో మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది.

అమెరికాలో గల ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లోని కార్మికులు 18 అడుగుల కొండచిలువ చనిపోయి కనిపించడంతో.. దాన్ని రీసెర్చ్ ల్యాబ్‌కు తరలించారు. అక్కడ నిర్వహించిన శవపరీక్ష( నెక్రోప్సీ) సమయంలో, కొండచిలువ కడుపులో భారీ మొసలిని వైద్యులు కనుగొన్నారు. ఆ మొసలి చాలా వరకు చెక్కుచెదరకుండా ఉందని శవపరీక్షకు లీడ్ చేసిన జియోసైంటిస్ట్ రూసీ మూర్ తెలిపారు. బాహ్య చర్మపు పొర అక్కడక్కడా దెబ్బతింది. ఎముకలు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉన్నాయి అని ఆమె USA టుడేతో చెప్పారు.

వీడియోను ఆల్ థింగ్స్ ఫాసినేటింగ్ ఖాతా నుంచి X లో షేర్ చేశారు. దానికి ఇప్పటివరకు 33 మిలియన్ల వ్యూస్ 135K లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు క్లిప్‌పై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆ మొసలిని జీర్ణించుకోలేకే అది చనిపోయి ఉంటుందని పేర్కొంటున్నారు. (Source)

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.