Throwback Photo: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. చిన్నతనంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ అరుదైన ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ జాబితాలో హీరోయిన్లు ఎక్కువగా నిలుస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన చాలా మంది హీరోయిన్లు తమ చైల్డ్‌వుడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ బ్యూటీకి సోదరుడు.. తన చెల్లితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. పైన ఫోటోలో సోదరుడి పక్కన రెండు జడలతో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఈ చిన్నారి బాలీవుడ్‌లో ఓ బడా స్టార్ హీరోయిన్. అంతేకాకుండా స్టార్ క్రికెటర్ భార్య కూడా… అవును మీ గెస్ కరెక్టే, ఆ చిన్నారి మరెవరో కాదు అనుష్క శర్మనే. తనదైన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అనుష్క శర్మకు సంబంధించిన చిన్న నాటి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అనుష్క అన్నయ్య.. కనేష్ శర్మ ఈ ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. నిజానికి ఈ ఫోటోను గత రాఖీ పండుగ సందర్భంగా పోస్ట్ చేసినప్పటికీ తాజాగా మళ్లీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే 2017 డిసెంబర్ 11న వివాహం చేసుకున్న అనుష్క శర్మ, విరాట్ జంట ఇటీవల ఓ పండటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.