Viral Video: కళ్ళను మాయ చేసే వింత.. ఆకు నుండి అకస్మాత్తుగా ఏర్పడిన సీతాకోకచిలుక.. వైరల్ గా మారిన వీడియో..

|

Jun 09, 2021 | 11:45 AM

Viral Video: ఈ ప్రపంచంలో పెద్ద జీవికి చిన్న జీవులు ఆహారంగా మారిపోవాల్సిందే. అయితే కొన్ని జంతువులు, పక్షులు మాత్రం పెద్ద పెద్ద జంతువుల

Viral Video: కళ్ళను మాయ చేసే వింత.. ఆకు నుండి అకస్మాత్తుగా ఏర్పడిన సీతాకోకచిలుక.. వైరల్ గా మారిన వీడియో..
Butterfly Video
Follow us on

Viral Video: ఈ ప్రపంచంలో పెద్ద జీవికి చిన్న జీవులు ఆహారంగా మారిపోవాల్సిందే. అయితే కొన్ని జంతువులు, పక్షులు మాత్రం పెద్ద పెద్ద జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి తమ నివాసాలను రహాస్యంగా ఏర్పర్చుకుంటాయన్న సంగతి తెలిసిందే. మరికొన్ని తామ శరీర రూపంతో ఇతర జంతువుల నుంచి తమను తాము కాపాడుకుంటాయి. శరీరా రూపాన్ని మార్చుకుంటూ.. నిర్జీవంగా ఉండే వస్తువులుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బోలేడు దర్శనమిస్తుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి వీడియోనే మరోకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఒక ఎండిపోయిన ఆకు నెల మీద పడి ఉంది. అయితే అక్కడే వున్న ఓ వ్యక్తి ఆ ఆకును పట్టుకోగా.. వెంటనే అది సీతాకోక చిలుకగా మారి ఎగిరిపోతుంది. ఇతర జంతువుల నుంచి తమ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పక్షులు ఇలా రూపాన్ని మార్చుకుంటాయి. ఈ వీడియోను బయోకాన్ వ్యవస్థపాకులు కిరణ్ మంజుదార్ షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇప్పటివరకు 41 వేల మందికి పైగా వీక్షించారు. సీతాకోక చిలుక రూపం మారిపోవడం చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి.

ట్వీట్..

Also Read: Corona Virus: కరోనా విషయంలోనూ ప్రత్యేక చాటుకున్న గిరిజనులు.. స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్న వైనం

దెయ్యాల గ్రామం.. భయంతో ఊరు మొత్తం ఖాళీ.. ఆ గ్రామం చుట్టు ప్రక్కల మనుషులే ఉండరు.. ఎక్కడుందంటే..

Telangana Rains: రాష్ట్రాన్ని ముందే పలకరించిన రుతుపవనాలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. వరంగల్ లోతట్టు ప్రాంతాలు జలమయం

Goutham reddy : ఏపీలో 3 కాన్సెప్ట్ సిటీస్.. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు.. మొత్తంగా 13 జిల్లాలను అభివృద్ధివైపు తీసుకెళ్తాయి : గౌతం రెడ్డి