Viral Video: మేకప్‌ వేస్తుంటే మురిసిపోయిన బుల్‌డాగ్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

| Edited By: Anil kumar poka

Apr 17, 2022 | 9:42 AM

విశ్వాసానికి, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తాయి శునకాలు. అందుకే చాలామంది వాటిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు.

Viral Video: మేకప్‌ వేస్తుంటే మురిసిపోయిన బుల్‌డాగ్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Bulldog
Follow us on

విశ్వాసానికి, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తాయి శునకాలు. అందుకే చాలామంది వాటిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఇక మనుషుల మాదిరిగానే కొన్ని కుక్కలకు చాలా తెలివితేటలు ఉంటాయి. తమ యజమానులు ఎలాంటి పనులు చేస్తే అవి కూడా అలాంటి పనులే చేస్తూ ఎంతో ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి కుక్కలు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. నవ్వు కూడా తెప్పిస్తుంటాయి. అందుకు తగ్గట్లే పెట్‌డాగ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఇంటి యజమాని తన బుల్‌డాగ్‌కు మేక‌ప్ వేస్తుంటారు. ఆ మేక‌ప్ వేసినంత సేపూ ఆ కుక్క న‌వ్వుతూ మురిసిపోతూనే ఉంటుంది. మేకప్‌ బ్రష్‌తో రాస్తుంటే దాని ముఖం వెయ్యివాట్ల బల్బులా వెలిగిపోతుంటుంది. యానిమ‌ల్స్ హిలేరియ‌స్‌ అనే యూజ‌ర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గామారింది. సాధారణంగా బుల్‌డాగ్స్‌ ఎంతో దూకుడుగా ఉంటాయి. కొన్నిసార్లు కోపంగా కూడా ఉంటాయి. అయితే ఈ వీడియోలోని బుల్‌డాగ్‌ మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంది. దీంతో ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ‘ఆ కుక్క బాగా సిగ్గుపడుతోంది’, ‘వీడియో చాలా బాగుంది’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Also Read: Samajwadi Party: పార్టీ పునర్జీవం కోసం స్వయంగా రంగంలోకి దిగిన ములాయం సింగ్ యాదవ్

DTC Recruitment 2022: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో 357 అసిస్టెంట్‌ పోస్టులు..నెలకు రూ.35,400ల వరకు జీతం..

CBSE Class 10,12 Exams 2022-23: గుడ్‌న్యూస్! వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఏడాదికి ఒక సారే..