CBSE Class 10,12 Exams 2022-23: గుడ్‌న్యూస్! వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఏడాదికి ఒక సారే..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి గతంతో మాదిరి ఒకేసారి బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం..
CBSE Likely To Restore Single-Board Exam Format From Next Academic Year: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి గతంతో మాదిరి ఒకేసారి బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంటే 10, 12 బోర్డు పరీక్షలను రెండు టర్ములుగా కాకుండా ఏడాదికి ఒకే సారి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. సీబీఎస్సీ గత విద్యా సంవత్సరంలో (2021-22) కరోనా మహమ్మారి రెండో వేవ్ కారణంగా పరీక్షలను రెండు టర్ములుగా తాత్కాలికంగా విభజించింది. టర్మ్-I బోర్డు పరీక్షలు గతేడాది నవంబర్-డిసెంబర్ మధ్య జరిగాయి. ఇక టర్మ్-II పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి. ఇక 2020-21 విద్యా సంవత్సరానికైతే బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా బోర్డు స్కూళ్లలో తిరిగి ఒకే పరీక్ష విధానాన్ని పునరుద్ధరించాలని సీబీఎస్సీ నిర్ణయించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. కోవిడ్ కారణంగానే గత ఏడాది రెండు టర్ముల పరీక్ష విధానాన్ని ప్రవేశ పెట్టామని, ఇకపై ఆ విధానం కొనసాగదని అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా 30 శాతం తగ్గించిన సిలబస్‌నే కొనసాగిస్తున్నారని, సిలబస్ పునరుద్ధరణపై ఎన్సీఈఆర్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదన్నారు. ప్రస్తుతం తగ్గించిన సిలబస్ ప్రకారంగానే తరగతులు కొనసాగుతాయని అధికారి తెలిపారు.
Also Read: