Viral Video: ఎద్దులతో జర్రబద్రం గురు .. ఏం కుమ్ముడు కుమ్మింది .. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే

|

Aug 20, 2022 | 6:42 PM

జతువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..వాటితో ప్రేమ గా ఉంటే సరి లేకుంటే మాత్రం చాలా చుక్కలు చూపిస్తాయి. జంతువులు మనుషుల మీద దాడి చేసిన వీడియోలు చాలా మనం చూస్తూ ఉంటాం.

Viral Video: ఎద్దులతో జర్రబద్రం గురు .. ఏం కుమ్ముడు కుమ్మింది .. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
Bull Attack
Follow us on

Viral Video: జతువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..వాటితో ప్రేమ గా ఉంటే సరి లేకుంటే మాత్రం చాలా చుక్కలు చూపిస్తాయి. జంతువులు మనుషుల మీద దాడి చేసిన వీడియోలు చాలా మనం చూస్తూ ఉంటాం.. కొన్ని సార్లు ఊహించని విధంగా దాడి చేసి గాయపరుస్తూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. జంతువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఈవీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాక మానదు. ఈ వీడియోలో ఓ ఎద్దు చేసిన దాడి చూస్తే నిజంగానే భయపడతారు.

తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పైన ఉన్న ఒక ఎద్దు ఉన్నట్టుండి ఓ వ్యక్తి పై తీవ్రంగా దాడి చేసింది. ఊహించని విధంగా ఎద్దు దాడి చేయడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓ వ్యక్తి ఇంట్లో నుంచి రోడ్డు పైకి వచ్చి తన స్కూటర్ ను స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ఈ లోగా అక్కడ ఉన్న ఒక ఎద్దు అతడిదగ్గరకు వచ్చింది. భయంతో అతడు వెనకడుగేసిన అది మాత్రం అతడి పై ఒక్కసారిగా దాడికి పాల్పడింది. దాని కొమ్ములతో కుమ్మడం మొదలు పెట్టింది. దాంతో అతడు రోడ్డు పై పడిపోయాడు. అయినా కూడా అది వదలలేదు. అతడి పైకి ఎక్కి తొక్కింది. గాయపడినా కూడా అది వదలలేదు. ఆతర్వాత ఆ ఇంట్లో నుంచి ఓ మహిళ రాగా ఆమె పై కూడా ఆ ఎద్దు దాడి చేసింది. ఇంతలో అక్కడికి కొంతమంది వచ్చి ఆ ఎద్దును బెదరగొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి