Viral Video: వణికిస్తున్న భారీ వర్షాలు..కళ్ల ముందే కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

 దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరదల ధాటికి (Floods) పురాతన భవనాలకు పెను ప్రమాదం...

Viral Video: వణికిస్తున్న భారీ వర్షాలు..కళ్ల ముందే కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
Building Collapse

Updated on: Jul 10, 2022 | 9:40 AM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరదల ధాటికి (Floods) పురాతన భవనాలకు పెను ప్రమాదం ఏర్పడుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో (Simla) ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సిమ్లాలోని చౌపల్‌ బజార్‌లో కూలిపోయిన ఈ భవనంతో బ్యాంకు, రెండు దుకాణాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా.. ఎడతెరిపి లేకండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ భవనం కూలిపోయింది. వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందుగానే అప్రమత్తమై భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

మరోవైపు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భైంసా పట్టణం నీటమునిగింది. ఏపీలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఇవాళ, రేపు కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కోరారు. వర్షాకాలం భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల సంస్థ ముందస్తుగా అప్రమత్తం అయినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి