
నేటి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ మాటని నిజం చేస్తున్నారు నేటి ప్రజలు. డబ్బుల కోసం ఉచ్చం నీచం మంచి చెడు అన్న మాటని విడిచి పెడుతున్నారు. ఏకంగా తమకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చంపేందుకు కూడా వెనుకాడడం లేదు నేటి పిల్లలు. అందుకు సజీవ సాక్షంగా నిలుస్తోంది బ్రిటన్ లో జరిగిన ఒక దారుణ సంఘటన. లండన్ కు చెందిన వర్జీనియా మెక్ కల్లౌ డబ్బు కోసం తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేయడమే కాదు.. వారి మృతదేహాలను 4 సంవత్సరాలు ఇంట్లో దాచిపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత కుమార్తె క్రూరత్వానికి ప్రజలు ఉల్కిపడ్డారు.
బ్రిటిష్ మీడియా నివేదికల ప్రకారం.. 36 ఏళ్ల వర్జీనియా జూన్ 2019లో తన తల్లి లూయిస్, తండ్రి జాన్ మెక్కల్లౌలను దారుణంగా హత్య చేసింది. వీరిద్దరికీ దాదాపు 70 సంవత్సరాలు. కూతురు తల్లిదండ్రులను హత్య చేయడానికి గల కారణం అప్పుల భారం. తాను చేసిన అప్పులు, క్రెడిట్ కార్డ్ తో చేసిన మోసం బయటపడితే.. తల్లిదండ్రులు తనని తిడతారనే భయం అని చెబుతోంది హంతకురాలు. తన అప్పుల గురించి తన తల్లిదండ్రులకు నిజం తెలిస్తే తాను చిక్కుకుపోతానని వర్జీనియా భయపడింది. ఈ భయం కారణంగా ఆమె ఈ భయంకరమైన , దారుణమైన హత్యలకు పాల్పడింది.
ఇంతటి క్రూరమైన పని చేసిన వృద్ద దంపతుల కుమార్తె కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ సాకుతో తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం, పెన్షన్ తీసుకునే ప్రక్రియను కొనసాగించింది. రెండు మృతదేహాలను ఇంట్లో దాచిపెట్టి.. ఆమె తన తల్లిదండ్రుల పేరుతో నాలుగు సంవత్సరాలుగా సందేశాలు పంపుతూనే ఉంది. వారిద్దరూ పర్యటనలో ఉన్నారని చెప్పి తన అక్కని చుట్టాలని అందరినీ తప్పుదారి పట్టిస్తూనే ఉంది.
వృద్దుల హత్య విషయం నిర్ధారించుకున్న కోర్టు వర్జీనియాకు 36 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే తన తల్లిదండ్రులను చెల్లెలు హత్య చేసింది అది కూడా డబ్బుల కోసం అన్న నిజాన్ని హంతకురాలి అక్క అంగీకరించలేకపోతుంది. ఈ నిజం తెలుసుకున్న తర్వాత కోలుకోలేకపోయింది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌తో సంభాషణలో లూయిస్ 1997 లోనే తాను ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు చెప్పింది. 2018 నాటికి.. తన న కుటుంబం నుంచి పూర్తిగా విడిపోయినట్లు చెప్పింది. అంతేకాదు ఒకవేళ నేను నా ఫ్యామిలీతో సంబంధం తెంచుకోకుండా ఉండి ఇంట్లోనే ఉండి ఉంటే.. బహుశా తన చెల్లెలు ఇలా హత్యలు చేసేది కాదని.. తన తల్లిదండ్రులు జీవించి ఉండేవారేమో అని చెప్పింది. కుళ్ళిపోయిన తన తల్లిదండ్రులను చూడడం కంటే భయంకరమైన సంఘటన తన జీవితంలో మరొకటి లేదని చెప్పింది. అయితే నేను నా చెల్లిని క్షమించాను, కానీ నా జీవితంలో మళ్ళీ ఆమె ముఖాన్ని చూడలేను” అని అంది.
కోర్టులో సమర్పించిన ఆధారాల ప్రకారం.. వర్జీనియా మొదట తన తండ్రికి విషం ఇచ్చి చంపింది. మర్నాడు ఉదయం తల్లికి తన భర్త మరణం గురించి తెలిసింది. దీంతో తల్లిని కూడా హత్య చేసింది. తన తల్లి రేడియో వింటుండగా.. ఆమెపై మొదట సుత్తితో దాడి చేశాడని ఆ మహిళ చెబుతోంది. అయితే సుత్తితో కొట్టిన తల్లి చచ్చిపోలేదని .. కత్తితో పొడిచి చంపినట్లు కూతురు వర్జీనియా చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..