Viral Video: డీజే పాటలతో ఉర్రూతలూగిస్తున్న వధువు..! చిందులు వేస్తూ సందడి చేస్తున్న పెళ్లి జంట

Viral Video: ఇంటర్నెట్ ప్రపంచంలో వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ఈ వీడియోలను

Viral Video: డీజే పాటలతో ఉర్రూతలూగిస్తున్న వధువు..! చిందులు వేస్తూ సందడి చేస్తున్న పెళ్లి జంట
Bride

Updated on: Sep 06, 2021 | 4:54 PM

Viral Video: ఇంటర్నెట్ ప్రపంచంలో వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ఈ వీడియోలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ చిరు నవ్వు నవ్వుతూ హ్యాపీగా ఫీలవుతారు. ఇందులో ఎక్కువగా కొత్త పెళ్లి జంట చేసిన డ్యాన్స్, భరాత్ డ్యాన్సులు ఉంటాయి. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వధువు DJ దగ్గర ఉండి అతిథుల కోసం కొత్త కొత్త పాటలు ప్లే చేస్తుంటుంది. అతిథులందరూ డ్యాన్స్ చేస్తు ఉంటారు.

వీడియోలో నవ వధువు డీజె దగ్గర ఉండటం మనం గమనించవచ్చు. చెవిలో హెడ్‌సెట్ పెట్టుకొని పాటలు ప్లే చేస్తుంటుంది. పెద్దగా అరుస్తూ స్టెప్పులు వేయడం మనం చూడవచ్చు. ఆమె సందడికి భర్త కూడా జోడవడంతో ఇద్దరు కలిసి పాడుతూ డ్యాన్స్ చేస్తారు. వీరిద్దరికి మరో వ్యక్తి కలిసి ముగ్గురు కలిసి చిందేయడం మనం వీడియోలో చూడవచ్చు. అయితే పెళ్లిలో ఇలాంటి సందడి కచ్చితంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారి వచ్చే పెళ్లి సందడిని ఎవ్వరైనా సరే గుర్తుండిపోయే విధంగా జరుపుకోవడానికి ఇష్టపడుతారు.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియోపై లైకుల వర్షం కురుస్తోంది. చాలామంది ఈ వీడియోను షేర్స్, కామెంట్స్ చేశారు. ఒక వినియోగదారు ‘మీ ఇద్దరికీ హ్యాపీ మ్యారేజ్’ అని చెప్పారు. మరొకరు వధువు చాలా సందడి చేస్తుందని ప్రశంసించారు. ఇంకొందరు ఇదొక ఉద్వేగభరిత క్షణంగా వర్ణించారు. కొంతమంది తమ పెళ్లి వేడుకలను గుర్తుకుతెచ్చిందంటూ చెప్పారు. ఏది ఏమైనప్పటికీ నెటిజన్లు వీడియో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Suma Kanakala: చీరకట్టులో మెరిసిన తెలుగింటి ఆడపడుచు.. వైరలవుతున్న యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటోలు..

Jayalalitha: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎస్టేట్‌లో దోపిడీ, హత్య కేసులో మళ్లీ సంచలన విషయాలు

Harbhajan Singh: హర్బజన్‌ సింగ్‌ తొలి సినిమాతోనే హిట్‌ కొట్టేలా ఉన్నాడే.. ఆకట్టుకుంటోన్న ఫ్రెండ్‌షిప్‌ ట్రైలర్‌.