Viral Video: ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌లా స్టెప్పులేసిన వధువు.. వరుడు ఫిదా!

|

Mar 07, 2022 | 6:47 PM

ఇంటర్నెట్ యుగంలో నెట్టింట బోలెడన్ని వీడియోలు ట్రెండ్ అవుతాయి. అందుకే వెడ్డింగ్ వీడియోలు ఎక్కువ ఉంటాయి. వధూవరుల సరదా ఆటపాటలకు సంబంధించిన ఎన్నో వీడయోలు ఇప్పటికే ట్రెండ్ అయ్యాయి.

Viral Video: ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌లా స్టెప్పులేసిన వధువు.. వరుడు ఫిదా!
Bride Dance
Follow us on

Trending Video: ఇంటర్నెట్ యుగంలో రోజూ నెట్టింట బోలెడన్ని వీడియోలు ట్రెండ్ అవుతాయి. అందుకే వెడ్డింగ్ వీడియోలు ఎక్కువ ఉంటాయి. వధూవరుల సరదా ఆటపాటలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే ట్రెండ్ అయ్యాయి. తాజాగా డీజేలో వధువు బాలీవుడ్(Bollywood) స్టైల్‌లో డ్యాన్స్ చేస్తున్న ఈ అందమైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పాట ప్లే అవుతుంది.. వధువు ఆ పాటకు డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టింది. వధువు డాన్స్ స్టెప్పులు ప్రొఫెషనల్‌ డ్యాన్సర్ లాగా ఉన్నాయి. ఇంతలో వరుడు కూడా తన భార్యతో కలిసి చిన్నగా డ్యాన్స్ చేయటం మొదలు పెట్టాడు. వధువు డ్యాన్స్‌ చూస్తూ వరుడు కొద్దికొద్దిగా నవ్వుతూ కనిపించడం వల్ల ఈ జంట చూడ ముచ్చటగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. పెళ్లికూతురు డ్యాన్స్‌ని చూసి కొంతమంది ఇదేంటని ఆశ్చర్యపోయినా, చాలా మంది నెటిజన్లు మాత్రం వుధువు డ్యాన్స్‌కి బాగా ఇంప్రెస్ అయ్యారు. భిన్నమైన కామెంట్లు ఇస్తున్నారు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఇంటర్‌నెట్‌(Internet) ప్లాట్‌ఫామ్‌పై వధువు చేసిన ఈ ఎనర్జిటిక్ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వీడియో చూడండి….

Also Read: పిల్లి కాదు ప్రాణాలను హరించే కలి.. ఇద్దరు మహిళలు, ఓ కుక్క బలి