Viral Video: ఇదెక్కడి వింత ఆచారంరా మావా..! అందరూ చూస్తుండగా ఇదేం పని..!!

|

Aug 08, 2022 | 4:07 PM

పెళ్లిళ్లలో జరిగే సంఘటనలు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. వివాహ వేదిక పై జరిగే సరదా సన్నివేశాలు ప్రతిరోజు  సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూడటానికి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

Viral Video: ఇదెక్కడి వింత ఆచారంరా మావా..! అందరూ చూస్తుండగా ఇదేం పని..!!
Viral Video
Follow us on

Viral Video: పెళ్లిళ్లలో జరిగే సంఘటనలు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. వివాహ వేదిక పై జరిగే సరదా సన్నివేశాలు ప్రతిరోజు  సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూడటానికి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరాల కామెంట్లు చేస్తున్నారు. మనకు తెలియని వింత వింత ఆచారాలు చాలానే ఉన్నాయి. వాటిని చూస్తే ఒకొక్కసారి భయం వేస్తుంది. మరి కొన్ని చూస్తే తెగ నవ్వొస్తుంది. ఇక పెళ్లిళ్లలో అయితే ఇలాంటి ఆచారాలు చాలా కనిపిస్తుంటాయి మనకు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా ఒక వింత ఆచారానికి సంబంధించిందే..

ఈ వీడియో నేపాల్ లో జరిగిన ఒక వివాహానికి సంబంధించింది. అక్కడ పెళ్లిళ్లు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. అక్కడి ఆచారాలు, పద్ధతులు చాలా వెరైటీగా ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వేదిక పై అందరు చూస్తుండగానే వధువు వరుడిగా కొట్లాటకు దిగింది. అయితే అక్కడి సంప్రదాయం ప్రకారం.. పెళ్లితో వధువు వరులు ఒకరినొకరు కొట్టుకోవాలట.. అయితే ముందుగా పెళ్ళికొడుకు పెళ్లికూతురిని మెల్లగా చెంప పై కొట్టే ప్రయత్నం చేశాడు. దాంతో వధువుకు పట్టరాని కోపం వచ్చేసింది.. అంతే అతడి పైకి సివంగి గా దూకి దాడి చేసింది. దాంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ  వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి