Viral: వధువుతో వరుడి ఫ్రెండ్‌ చిలిపి పని.. కట్ చేస్తే.. ఊహించని సీన్.. అతిధులు అంతా షాక్!

|

Mar 22, 2023 | 1:29 PM

పెళ్లి అనేది వధూవరులకు జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. బంధువుల హడావుడి, అమ్మలక్కల కబుర్లు..

Viral: వధువుతో వరుడి ఫ్రెండ్‌ చిలిపి పని.. కట్ చేస్తే.. ఊహించని సీన్.. అతిధులు అంతా షాక్!
Marriage
Follow us on

పెళ్లి అనేది వధూవరులకు జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. బంధువుల హడావుడి, అమ్మలక్కల కబుర్లు, మిత్రుల సరదాలు.. ఇలా ఒకటేమిటి పెళ్లంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం నిండి ఉంటుంది. అయితే ఒక్కోసారి మితిమీరిన ప్రవర్తనలే.. చేదు జ్ఞాపకాలను మిగులుస్తాయి. ఇందుకు నిదర్శనంగా ఓ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. వరుడి స్నేహితుడి ప్రవర్తనకు వధువుకు చిరాకు రావడమే కాదు.. ఏకంగా ఊహించని షాకిచ్చింది.. దీంతో వచ్చిన అతిధులందరూ కూడా దెబ్బకు స్టన్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బిహియా నగర్‌ సమీపంలో మార్చి 15వ తేదీన ఓ వివాహ వేడుక జరిగింది. ఆ రోజు రాత్రి 11 గంటలకు బక్సర్ నుంచి ఊరేగింపుగా వరుడు కళ్యాణ మండపానికి వచ్చాడు. జయమాల వేడుక ముగియగానే వధూవరులు వేదికపై కూర్చున్నారు. వరుసగా అతిధులు ఒక్కొక్కరిగా వచ్చి ఇద్దరితోనూ ఫోటోలు దిగారు. ఆ తర్వాత వరుడి స్నేహితులు కూడా వచ్చి వధూవరులతో ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో ఓ స్నేహితుడు వేదికపై డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.

మనోడి ప్రవర్తన కాస్త మితిమీరి.. పెళ్లికూతురు చేయి పట్టుకుని ఆమెతో కూడా డ్యాన్స్ చేయించాలని ప్రయత్నించాడు. ఇది కాస్తా వధువుకు నచ్చలేదు. ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి వేదికపై నుంచి కిందికి దిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత వధూవరుల కుటుంబసభ్యుల మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా తన స్నేహితుడికే వరుడు వత్తాసు పలకడంతో.. వధువు పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. దీంతో అతిధులు అంతా షాక్ అయ్యారు.