కంటే ఇలాంటి కూతుర్నే కనాలిరా

| Edited By:

Apr 20, 2019 | 3:37 PM

‘‘కంటే కూతుర్నే కనాలి’’ అని పెద్దలు ఊరికే అనలేదు. తల్లిదండ్రుల కష్టాలను అమ్మాయి అంతలా అర్థం చేసుకుంటుంది కాబట్టే ఎప్పుడో పెద్దలు ఆ మాటను చెప్పారు. అయితే ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లను భారంగా చూసేవాళ్లూ లేకపోలేదు. ఏదేమైనా తల్లిదండ్రుల కష్టాల్లో పాలుపంచుకునేందుకు కూతురు ఎప్పుడూ ముందుంటుందని తెలిపే సంఘటన ఇటీవల కోల్‌కతాలో ఒకటి జరిగింది. కోల్‌కతాకు చెందిన రాఖీ దత్తా అనే 19 ఏళ్ల యువతి.. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న తండ్రి కోసం తన లివర్‌లోని […]

కంటే ఇలాంటి కూతుర్నే కనాలిరా
Follow us on

‘‘కంటే కూతుర్నే కనాలి’’ అని పెద్దలు ఊరికే అనలేదు. తల్లిదండ్రుల కష్టాలను అమ్మాయి అంతలా అర్థం చేసుకుంటుంది కాబట్టే ఎప్పుడో పెద్దలు ఆ మాటను చెప్పారు. అయితే ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లను భారంగా చూసేవాళ్లూ లేకపోలేదు. ఏదేమైనా తల్లిదండ్రుల కష్టాల్లో పాలుపంచుకునేందుకు కూతురు ఎప్పుడూ ముందుంటుందని తెలిపే సంఘటన ఇటీవల కోల్‌కతాలో ఒకటి జరిగింది.

కోల్‌కతాకు చెందిన రాఖీ దత్తా అనే 19 ఏళ్ల యువతి.. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న తండ్రి కోసం తన లివర్‌లోని 65 శాతాన్ని దానం చేసింది. భవిష్యత్తులో తనకు ఎదరుయ్యే సమస్యల గురించి, సర్జరీ వలన కలిగే నొప్పి గురించి.. ఏర్పడే గాట్ల గురించి ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. కేవలం తన తండ్రి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాఖీ ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీనిని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్స్ గోయాంక షేర్ చేస్తూ.. ‘‘తండ్రి పట్ల కూతురు చూసే ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. కూతుర్లను చిన్నచూపు చూసే తల్లిదండ్రులకు ఇదే కరెక్ట్ సమాధానం’’ అంటూ పేర్కొన్నాడు.