Brain Teaser Picture Puzzle: ఈ చిత్రంలో ఓ తప్పు దాగుంది.. 10 సెకన్లలో కనుక్కుంటే మీరు జీనియస్‌.. అంతే

ఫజిల్స్ వల్ల మన మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు మానసిక నిపుణులు. ఈ ఫజిల్ ఫోటోస్ ను గుర్తించడం, పరిష్కరించడం కాస్త కష్టమైనప్పటికీ ఆ కిక్కు మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.

Brain Teaser Picture Puzzle: ఈ చిత్రంలో ఓ తప్పు దాగుంది.. 10 సెకన్లలో కనుక్కుంటే మీరు జీనియస్‌.. అంతే
Brain Teaser Picture Puzzle

Updated on: Jul 29, 2022 | 6:23 AM

Brain Teaser Picture Puzzle: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఆసక్తికరమైన పోస్టులు, చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్స్.. ఫజిల్స్ కూడా ఉంటాయి. చాలామంది ఫజిల్స్ పూర్తి చేయడానికి ఆన్లైన్లో ఎప్పుడూ ముందుంటారు. అయితే వీటి వల్ల లాభం కూడా ఉందంటున్నారు నిపుణులు. అదేంటంటే..? ఫజిల్స్ వల్ల మన మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు మానసిక నిపుణులు. ఈ ఫజిల్ ఫోటోస్ ను గుర్తించడం, పరిష్కరించడం కాస్త కష్టమైనప్పటికీ ఆ కిక్కు మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే వీటిని సరైన సమయంలో గుర్తిస్తే అసలు మజా వస్తుంది. బ్రెయిన్ టీజర్ పిక్చర్ పజిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది కనిపెట్టాలంటే బుర్రకు పనిచేప్పడంతోపాటు తెలివితేటలను కూడా ఉపయోగించాలి. ఈ ఆసక్తికరమైన బ్రెయిన్ టీజర్ ఏంటంటే.. ఇక్కడ మీరు డోర్ ఇమేజ్‌లో దాగి ఉన్న ఓ తప్పును గుర్తించాలి.

పై చిత్రంలో మీరు తలుపు లోపల దాగి ఉన్న తప్పును 10 సెకన్లలో గుర్తిస్తే మీ మెదడు సూపర్ అని చెప్పవచ్చు. ఈ సమాధానం చాలా సరళమైనది కానీ గమ్మత్తుగా ఉంది. కావున ప్రశ్నకు సమాధానమిచ్చే ముందు మీరు చిత్రాన్ని జాగ్రత్తగా చూడాలి. క్షణ్ణంగా చూస్తే తప్పు ఈజీగా కనుగొనవచ్చు. ఒకవేళ మీరు దానిని గుర్తించకపోతే.. కొన్ని చూచనలు కూడా ఇస్తున్నాము చూడండి.. డోర్ హ్యాండిల్, నాబ్, లాక్ మొదలైన భాగాలను క్షణ్ణంగా పరిశీలించండి..

ఇవి కూడా చదవండి

బ్రెయిన్ టీజర్ ఆన్సర్..

ఈ బ్రెయిన్ పజిల్‌లో డోర్‌కు హ్యాండిల్‌, లాక్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయి కానీ.. తాళంలో కీకి రంధ్రం మాత్రం లేదు. గమనించకపోతే ఒకసారి మళ్లీ చూడండి..

Puzzle

Image Source: Briddles

గమ్మత్తైన ప్రశ్నలు, పజిల్‌లతో మీరు కూడా స్నేహితులను ఆట పట్టించాలనుకుంటే ఇంకేందుకు ఆలస్యం దీనిని షేర్‌ చేసి.. వారి అభిప్రాయాలను తెలుసుకోండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి