
Funny Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవ్వరు ఊహించలేరు. కానీ చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతువుల వీడియోలు, వివాహ వీడియోలు, భయంకర వీడియోలు, హాస్య వీడియోలు ఇలా చాలా ఉంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని పదే పదే చూస్తారు. లైక్స్, కామెంట్స్‌తో హోరెత్తిస్తారు. తాజాగా ఒక ఫన్నీ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇది ఒక అబ్బాయి, అమ్మాయికి సంబంధించింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో ఒక అమ్మాయి లిఫ్ట్ కోసం వేచి ఉండటం మనం గమనించవచ్చు. ఇంతలో ఒక గది నుంచి ఒక అబ్బాయి బయటకి వస్తాడు. ఆ అమ్మాయిని చూసి ఇంప్రెస్ చేద్దామని అనుకుంటాడు. మైకెల్‌జాక్సన్ పాటకి మూమెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ సీన్ రివర్స్ అవుతుంది. కాలుకి ఉన్న చెప్పు కాస్త పైకి ఎక్కడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ సంఘటనని గమనించిన ఆ యువతి ఒక్కసారిగా నవ్వుతుంది. మనోడి ఉన్న పరువు పోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. అంతేకాదు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
వీడియో చూసిన తర్వాత నెటిజన్లు అబ్బాయిని తీవ్రంగా దూషిస్తున్నారు. కామెంట్ల ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్ ‘బిల్డప్ ఇచ్చేముందు చుట్టుపక్కల గమనించాలి’ అన్నాడు. మరొకరు ‘ పాపం అబ్బాయి పరువు పోయింది’ అని జాలి పడ్డాడు. ఇంకొకరు ‘ తిక్క కుదిరింది’ అంటూ కామెంట్ చేశాడు. మీరు కూడా ఈ వీడియో చూస్తే మీ కామెంట్ తెలపండి.