Viral Video: ఇదెక్కడి మాస్ డ్రైవింగ్ మావా.. బ్యాలెన్స్ తప్పితే బతుకు బస్టాండే!

|

Jun 22, 2022 | 12:05 PM

ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. అయినప్పటికీ వాహనదారులు జాగ్రత్తలు పాటించట్లేదు...

Viral Video: ఇదెక్కడి మాస్ డ్రైవింగ్ మావా.. బ్యాలెన్స్ తప్పితే బతుకు బస్టాండే!
Viral Video
Follow us on

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వాటిల్లో ఒకటే ఇప్పుడు మేము చూపించబోయే వీడియో. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. అయినప్పటికీ వాహనదారులు జాగ్రత్తలు పాటించట్లేదు. ఇంకా కొందరు ఇప్పటికీ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్నారు. తాజాగా ఓ వాహనదారుడు చేసిన బైక్ డ్రైవింగ్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ దుకాణదారుడు సామాన్లు డెలివరీ చేసేందుకు పెద్ద ప్లాన్ వేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం జనాలు తమ షాపు‌లో ఆర్డర్ చేసిన వాటిన్నంటినీ తన బైక్‌పైనే తరలిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఎక్కడైనా కూడా ఆ బైక్ బ్యాలెన్స్ తప్పితే.. ఆ వ్యక్తి బతుకు బస్టాండ్ అవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను తెలంగాణ పోలీసులు ట్యాగ్ చేశారు. ‘జీవితం విలువైనది.. ప్రమాదంలోకి నెట్టకండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 5.5 లక్షల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.