Watch Video: దూల తీరింది వెదవకి.. గేదని తన్నబోయాడు అంతలోనే

జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. అవి ఎలాంటి హాని తలపెట్టకపోయినప్పటికి వాటిని శిక్షిస్తూ రాక్షసానందం పొందుతారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి కుప్పలు తెప్పులు ఉండే వీడియోలు మనసును కలచివేసేలా ఉంటున్నాయి.

Watch Video: దూల తీరింది వెదవకి.. గేదని తన్నబోయాడు అంతలోనే
Bike

Updated on: May 01, 2023 | 7:21 PM

జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. అవి ఎలాంటి హాని తలపెట్టకపోయినప్పటికి వాటిని శిక్షిస్తూ రాక్షసానందం పొందుతారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి కుప్పలు తెప్పులు ఉండే వీడియోలు మనసును కలచివేసేలా ఉంటున్నాయి. అయితే తాజాగా ఓ మూగజీవాన్ని తన్నబోయిన ఆకతాయికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

వివరాల్లోకి వెళ్తే ఓ బైక్‌పై ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారు. అలా రోడ్డుపై వెళ్తుండగా దారిలో వారికి గేదెలు కనిపించాయి. అలా వాటి దగ్గరికి వెళ్లగా వెనుక కూర్చున్న వ్యక్తి ఆ గేదెను తన్నాడు. ఆ తర్వాత వెంటనే అతను బైక్ నుంచి జారిపడ్డాడు. అలాగే బైక్ నడుపుతున్న తన స్నేహితుడు కూడా అదుపుతప్పి బైక్‌తో సహా కిందపడ్డాడు. దీంతో ఇద్దరు గాయాలపాలయ్యారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆకతాయిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు .  మూగజీవాలకు హాని చేయెద్దు అని హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి