Baba Vanga: బాబా వాంగ చెప్పిన 6 విషయాల్లో 2 ఇప్పటికే నిజం.. 2022కి చెప్పిన మరో నాలుగు అంశాలు ఏమంటే?

|

Jul 17, 2022 | 11:12 AM

అంధ ఆధ్యాత్మిక బాబా వంగా 2022 సంవత్సరానికి సంబంధించి ఆరు సంఘటనలు చెప్పారని.. వాటిల్లో ఇప్పటికే రెండు నిజమయ్యని చెబుతున్నారు.

Baba Vanga: బాబా వాంగ  చెప్పిన 6 విషయాల్లో 2 ఇప్పటికే నిజం.. 2022కి చెప్పిన మరో నాలుగు అంశాలు ఏమంటే?
Blind Mystic Baba Vanga
Follow us on

Blind mystic Baba Vanga: భవిష్యత్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో మానవమాత్రుడికి సాధ్యం కాదు.. అయితే కొంతమంది జ్యోతిష్కులు.. జ్యోతిష్యశాస్త్రం (Astrology) ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఫ్రాన్స్‌కి చెందిన నోస్ట్రడామస్  బల్గేరియాకు చెందిన బాబా వాంగ వంటి వారు ప్రముఖ జ్యోతిష్యులుగా ఖ్యాతిగాంచారు. అయితే బాబా వాంగ అంధ జ్యోతిష్యురాలు. ఆమె తన అతీంద్రియ శక్తులతో గతంలోనే అంచనావేశారంటున్నారు ఆమె అనుచరులు. ఏ  సంవత్సరంలో ఏం జరుగుతుందో తన జ్యోతిష్యంలో వివరించారని ఆమె తన చిన్నతనంలో ఓ భయంకర పెను తుఫానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వంగా దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను ముందే ఊహించారని పేర్కొంటున్నారు. తనకు కళ్ళు పోయిన సమయంలో భగవంతుడు భవిష్యత్ ను దర్శించే అవకాశం ఇచ్చాడని పలు సందర్భాల్లో పేర్కొన్నది. బాబా వాంగ ముందే ఊహించి చెప్పిన వాటిలో దాదాపు 85 శాతం నిజమయ్యాయి. బాబా వాంగా 26 ఏళ్ల కిందటే 1996లో తన 84వ ఏట తుదిశ్వాస విడిచారు.

అంధ ఆధ్యాత్మిక బాబా వంగా 2022 సంవత్సరానికి సంబంధించి ఆరు సంఘటనలు చెప్పారని.. వాటిల్లో ఇప్పటికే రెండు నిజమయ్యని చెబుతున్నారు. 9/11 దాడులు , చెర్నోబిల్ విషాదం, యువరాణి డయానా మరణం, సోవియట్ యూనియన్ రద్దు, 2004 థాయిలాండ్ సునామీ , బరాక్ ఒబామా అధ్యక్ష పదవి సహా అనేక సంఘటనలు ఆమె ముందే అంచనా వేసి చెప్పినట్లు అనుచరులు పేర్కొన్నారు.  ప్రపంచం 5079 వరకు నడుస్తుందని.. ఆమె అంచనావేశారు.

బాబా వంగా 2022 అంచనాలు.. 2022 సంవత్సరంలో అనేక ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా “తీవ్రమైన వరదలతో” దెబ్బతింటాయని బాబా వంగా అంచనా వేశారు. భారీ వర్షం, వరదలు ఆస్ట్రేలియాలోని ఈస్ట్ కోస్ట్‌లో ఈ ఏడాది చాలా వరకు వర్షాలు, వరదలు వినాశనాన్ని సృష్టించాయి. నీటి ఎద్దడితో పెద్ద నగరాలు బాబా వంగా సూచించారు. పోర్చుగల్, ఇటలీ ప్రభుత్వాలు తమ పౌరులకు నీటి వినియోగాన్ని పరిమితం చేయమని చెప్పాయి. ఇటలీ 1950ల తర్వాత అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. బాబా వంగా సైబీరియాలో మరో మహమ్మారిని కూడా అంచనా వేశారు. పరిశోధకులు ప్రాణాంతక వైరస్‌ను కనుగొంటారు, ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా భారతదేశంలో మిడుతలు దండెత్తుతాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

భవిష్యత్ లో జరిగే వాటిపై బాబా వంగా అంచనాలు.. 

2023లో భూమి  కక్ష్య మారుతుందని పేర్కొన్నారు.
2028లో వ్యోమగాములు శుక్రగ్రహం పైకి చేరుకుంటారు.
2046లో అవయవ మార్పిడి సాంకేతికత కారణంగా ప్రజలు 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తారని కూడా ఆమె అంచనా వేశారు.
2100 నుండి..  రాత్రి అదృశ్యమవుతుందని.. కృత్రిమ సూర్యకాంతి భూ భాగాన్ని ప్రకాశింపజేస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచం 5079లో ముగుస్తుందని ఆమె అంచనా వేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..