Viral: వామ్మో! ఇదేం రివెంజ్ సామీ.. తనను కరిచిన పామును ఏకంగా నరికేసి.. కొరికేసి..

|

Jun 22, 2022 | 12:30 PM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి.. తనను పాము కాటేసిందని.. కోపంతో ఏకంగా ఆ పామును నరికేసి..

Viral: వామ్మో! ఇదేం రివెంజ్ సామీ.. తనను కరిచిన పామును ఏకంగా నరికేసి.. కొరికేసి..
Snake
Follow us on

పాములు మనుషులను కరవడం సర్వసాధారణం. మిమ్మల్ని ఓ పాము కాటేసినప్పుడు మీరేం చేస్తారు.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి.. తనను పాము కాటేసిందని.. కోపంతో ఏకంగా ఆ పామును నరికేసి.. కొరికేసి తినేశాడు. చివరికి ఏం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. బండా జిల్లాలోని స్యోహాట్ గ్రామానికి చెందిన 49 ఏళ్ల మతబదాల్ సింగ్‌ పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. పాము కరిచింది. ఎవరినైనా సహాయానికి పిలవకుండా.. అతడు ఆ పామును పట్టుకుని.. దాన్ని నరికేసి.. ముక్కలుగా కోసి.. తినేసి.. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇక ఇంటికి చేరుకున్న మతబదాల్ సింగ్‌ను చూసిన కుటుంబ సభ్యులు ఒకింత షాక్‌కు గురయ్యారు. అతడి షర్ట్‌పై రక్తపు మరకలు ఉండటంతో.. ఏం జరిగిందోనని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మతబదాల్ సింగ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని.. ఆరోగ్యం కుదుటపడిందని డాక్టర్లు చెబుతున్నారు.