Viral: ప్లీజ్ సార్.. నాకు సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేయండి.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన దివ్యాంగుడు..

|

Aug 08, 2023 | 6:34 PM

Bizarre incident: జీవితంలో ఎవ్వరైనా పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. చదువు, ఉద్యోగమే కాదు.. పెళ్లి కూడా ముఖ్యమే.. అందుకే.. చాలామంది పెళ్లిడుకు రాగానే అమ్మాయిలు అబ్బాయిల కోసం.. అబ్బాయిలు అమ్మాయిల కోసం వెతుకుతుంటారు. పెద్దలు కూడా తమ పిల్లలకు మంచి సంబంధాలు చూడాలని అక్కడా .. ఇక్కడా అనే తేడా లేకుండా వెతకడం మొదలుపెడతారు.

Viral: ప్లీజ్ సార్.. నాకు సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేయండి.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన దివ్యాంగుడు..
Marriage
Follow us on

Bizarre incident: జీవితంలో ఎవ్వరైనా పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. చదువు, ఉద్యోగమే కాదు.. పెళ్లి కూడా ముఖ్యమే.. అందుకే.. చాలామంది పెళ్లిడుకు రాగానే అమ్మాయిలు అబ్బాయిల కోసం.. అబ్బాయిలు అమ్మాయిల కోసం వెతుకుతుంటారు. పెద్దలు కూడా తమ పిల్లలకు మంచి సంబంధాలు చూడాలని అక్కడా .. ఇక్కడా అనే తేడా లేకుండా వెతకడం మొదలుపెడతారు. అయితే, ప్రస్తుత కాలంలో చాలా మంది కుర్రాళ్లకు అమ్మాయిలు దొరకడం లేదు.. దీనికి ఏవేవో కారణాలున్నాయి. కొంతకాలం నుంచి అమ్మాయిని వెతికిపెట్టండి.. ప్లీజ్.. అంటూ కొంతమంది కుర్రాళ్లు ప్రాథేయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నా.. మంచిగా ఆస్తులు ఉన్నాయి.. కానీ, అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.. అంటూ కొందరు ఫిర్యాదులు చేసిన ఘటనలు సైతం ఉన్నాయి. మరికొందరు పెళ్లి కావడం లేదని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.. ఇవన్నీ పక్కన పెడితే.. ఓ దివ్యాంగుడు నాకు పిల్లను చూడండి అంటూ ఏకంగా కలెక్టర్ కే ఫిర్యాదు చేశాడు. తనకు సరిపోయే ఓ అమ్మాయిని వెతికి పెళ్లి చేయాలంటూ వేడుకున్నాడు. ఈ వింత ఘటన ఒడిశాలోని అంగుల్ లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. చెందిపాడు బ్లాక్‌ పరిధిలోని నుపాడ గ్రామానికి చెందిన సంజీబ్‌ మహపాత్ర దివ్యాంగుడు (పీడబ్ల్యూడీ).. చెందిపాడు పంచాయతీ సమితి కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ఫిర్యాదుల పరిష్కార శిబిరానికి హాజరైనట్లు తెలుస్తోంది. సంజీబ్ తన దరఖాస్తులో, తన వృద్ధ తల్లిదండ్రుల వయస్సు పైబడటంతో వారు తనకు తగిన అమ్మాయిని కనుగొనలేకపోయారని తెలియజేసారు. “నా తల్లిదండ్రులు వారి వయస్సు పెరగడం వల్ల ఇప్పుడు వంట చేయలేరు. నాకు జీవిత భాగస్వామిని కనుగొనమని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థించాను” అని సంజీబ్ మీడియాకు వివరించారు.

Odisha news

సంజీబ్ తన అన్నయ్య తనతో ఉండడని తెలియజేశాడు. ఇది అతని జీవితానికి మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తంచేశాడు. వృద్ధులైన తల్లిదండ్రులను ఆదుకునే వారు లేకపోవడం.. ఇంట్లో మరెవరూ కుటుంబ సభ్యులు లేకపోవడంతో కష్టాలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నాడు. తన సమస్యను గుర్తించి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని కోరాడు.

ఇవి కూడా చదవండి

అయితే, దీనికి సంబంధించి కలెక్టర్ లేదా ఏ పరిపాలనా అధికారి కూడా స్పందించలేదు.. కానీ.. ఈ ఘటన ఒడిశాతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతని బాధను అర్ధం చేసుకుని పిల్లను చూడాలంటూ కొందరు కలెక్టర్ ను కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..