Viral Video: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు కుమ్మేస్తున్నాయి. ఉదయం 11 దాటిన తరువాత ఇంట్లోనుంచి బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు జనాలు. ఒకవేళ అత్యవసర పనులపై బయటకు వెళ్లినా.. ఎండ నుంచి తమను తాము కాపాడుకునేందుకు రక్షణ చర్యలు తప్పనిసరి తీసుకుంటాం. బయటకు వెళ్లేప్పుడు వెంట గొడుగు, వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తాం. మనుషులం కాబట్టి ఎండ నుంచి తట్టుకునేందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి జంతువులు, పక్షుల పరిస్థితి ఏంటి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలి దాటి నమోదవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకునే మనమే ఇన్ని అవస్థలు పడుతుంటే.. చిన్న ప్రాణాలైన పక్షుల పరిస్థితి ఏంటి?. అవును.. ఈ ఎండల తీవ్రలను తట్టుకోలేక పక్షలు విలవిల్లాడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో.. పిట్టలు ప్రాణాలు కోల్పోతున్నాయి. నీరు దొరక్క ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నాయి.
తాజాగా ఈ దారుణ పరిస్థితికి అద్దం పట్టే ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రజల హృదయాలను పిండేస్తుంది. ఎండ వేడిమికి తాళలేక ఓ పక్ష రోడ్డుపై పడిపోయింది. ఆ పక్షిని గమనించిన ఓ వాహనదారుడు.. వెంటనే దాని వద్దకు వచ్చాడు. బాటిల్‌లో నీటిని క్యాప్‌లో పోసి దానికి తాపించాడు. ఎండవేడిమికి తాళలేక కొనప్రాణాలతో కొట్టామిట్టాడుతున్న ఆ పక్షికి చివరకు ఒక చుక్క నీరు దొరకడంతో ప్రాణం లేచివచ్చింది. ఆ వ్యక్తి బాటిల్ క్యాప్‌తో వాటర్ తాగిపించగా.. పిట్టకు ప్రాణం లేచివచ్చింది. నీరు తాగగానే కాస్త ఊపిరి పీల్చుకుంది. అప్పటి వరకు కునారిల్లిన ఆ పక్షి.. నీరు అందగానే కాస్త కోలుకుని లేచి నిలబడింది. కడుపునిండా నీరు తాగిన తరువాత ఆ పక్షి కాస్త సెట్ అయ్యింది.
కాగా, పక్షులు ఎదుర్కొంటున్న ఈ దయనీయ పరిస్థితికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘ప్రతీ నీటి చుక్క వెనుక ఒక కథ ఉంటుంది’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పక్షి పరిస్థితి చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. ఎండాకాలంలో మనుషులతో పాటు.. ఇతర జంతువులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటాయని, వాటిని కూడా రక్షించేందుకు ఎవరికి తోచిన స్థాయిలో వారు నోటి తొట్టిలు, నీటితో ఉన్న కుండీలు, ఇతర మార్గాల ద్వారా నీటిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇక, ఆ పక్షిని కాపాడిన వారికి అభినందనలు తెలుపుతున్నారు.
Every drop of water has its own story…
Only getting tragic with climate change.
(VC in the clip) pic.twitter.com/Ytb7TY8rcL— Susanta Nanda IFS (@susantananda3) April 29, 2022
Also read:
Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..
Snake Doing Yoga: ఉదయాన్నే ‘ప్రాణయామం’ చేస్తున్న నాగుపాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!
Solar Eclipse 2022: ప్రపంచాన్ని వణికిస్తున్న సూర్యగ్రహణం.. భయానికి కారణమిదేనా?..