పక్షులు గాల్లో ఎంతో వేగంగా ఎగురుతాయి. ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుకోవాలంటే పక్షులకు ఉన్న ఏకైక మార్గం ఎగరడం. అయితే రెక్కలు ఉన్న పక్షులు ఎగరలేవు. అలాగే అన్ని పక్షులు అత్యంత వేగంగా ఎగరలేవు. అత్యంత ఎత్తులో మేఘాలపై సైతం ఎగరగలిగే ఒకే ఒక పక్షి డేగ. వేగంగా.. ఎత్తులో అన్ని పక్షులను మించి ఇది ఎగురుతుంది. అయితే ఓ డేగ మాత్రం ఎగరడమే మర్చిపోయింది. తనకున్న రెక్కలను ఆడిస్తూ ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కానీ అసలు ఎలా గాల్లోకి వెళ్లాలని అనే విషయాన్నే మర్చిపోయింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అసలు ఆ పక్షి ఎందుకు ఎగరడం లేదో తెలుసుకుందామా.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ పెద్ద డేగను చాలా సంవత్సరాలుగా జూలో బంధించారు. చాలా సంవత్సరాల తర్వాత ఓ కొండపైకి తీసుకెళ్లి ఆ పక్షిని బంధీ నుంచి విముక్తిని చేశారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆ డేగ తన రెక్కలను కదిస్తూ గాల్లోకి ఎగిరే ప్రయత్నం చేసింది. ఎలా అనే విషయాన్ని పూర్తిగా మార్చిపోయింది. రెక్కలను ఆడిస్తూ గాల్లోకి అటు ఇటు తిరిగింది. కానీ ఎలా ఎగరాలనే విషయం ఆ డేగకు తెలియలేదు. ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా సంవత్సరాలు పూర్తిగా బంధించడంతో ఆ పక్షి ఎగరడం మర్చిపోవడంతో నెటిజన్స్ భావోద్వేగ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Penny Song: పెన్నీ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా.. సీతూపాప ఎంత ముద్దుగా చేసిందో..
Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..