
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ మనదే. ఇండియన్ రైల్వేస్ ఆ ఘనతను కలిగి ఉంది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తారు. భారతదేశంలో సుదూర ప్రయాణాలకు రైళ్లు అత్యంత ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థ. పెద్ద నగరాల నుండి గ్రామాల వరకు భారతదేశం అంతటా అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలోని ప్రతి వ్యక్తికి సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో భారతీయ రైల్వేలు పనిచేస్తాయి. కానీ సంవత్సరంలో 15 రోజులు మాత్రమే పనిచేసే రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలుసా?
ఈ విచిత్రమైన రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక రోజుల్లో మాత్రమే రైళ్లు ఆగుతాయి. మిగిలిన రోజుల్లో ఈ రైల్వే స్టేషన్ పనిచేయదు. గత 26 సంవత్సరాలలో ఈ రైల్వే స్టేషన్‌లో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఇది బీహార్ రాష్ట్రంలోని గ్రాండ్ గార్డ్ రైల్వే లైన్‌లో ఉన్న మొఘల్ సారాయ్‌లోని అనురాగ్ నారాయణ్ రోడ్ ఘాట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే లైన్ తూర్పు మధ్య రైల్వే డివిజన్ కింద పనిచేస్తుంది. ఇది బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా పరిధిలో ఉంది.
అనురాగ్ రోడ్ ఘాట్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ పాలనలో స్థాపించారు. ఈ స్టేషన్ గత 26 సంవత్సరాలుగా ఉపయోగం లేకుండా ఉంది. పైగా ఈ స్టేషన్‌లో దిగేందుకు, ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఎవరు టిక్కెట్ కొనరు. ఈ స్టేషన్‌లో ఎవరూ టిక్కెట్లు కొననప్పుడు, భారతీయ రైల్వేలు ఈ స్టేషన్‌ను ఎందుకు నిర్వహిస్తోందనే డౌట్ రావొచ్చు. ఈ స్టేషన్‌లో ఏడాదికి కేవలం 15 రోజులు మాత్రమే రైళ్లు ఆగుతాయి. అది కూడా పితృ పక్ష సమయంలో. అందుకే ఇక్కడ ఎవరు టికెట్ కొనరు. ఈ స్టేషన్‌లో ఎవరూ రైలు టిక్కెట్లు కొనరు కాబట్టి, ఇక్కడ రైల్వే ఉద్యోగులు కూడా ఉండరు. అయితే పితృ పక్ష సమయంలో ఈ రైల్వే స్టేషన్‌లో 4 నుండి 5 మంది ఉద్యోగులు 15 రోజులు మాత్రమే పనిచేస్తారు.26 ఏళ్లుగా ఈ రైల్వే స్టేషన్‌లో ఒక్క టిక్కెట్ అమ్ముడుపోలేదు! ఇంత విచిత్రమైన స్టేషన్ మన దేశంలోనే ఉందని తెలుసా?
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి